Arif Mohammed Khan | అయోధ్య రామమందిరాన్ని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ బుధవారం దర్శించుకున్నారు. రామ్‌లల్లాను దర్శించుకున్నారు. బాలరాముడి విగ్రహం ఎదుట నిలబడి ప్రణమిల్లిన ఆయన.. ఆ తర్వాత మోకాళ్లపై కూర్చొని, అనంతరం తలను నేలకు ఆన్చి మొక్కుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేరళ గవర్నర్ కార్యాలయం సోషల్ మీడియాలో పోస్ చేసింది. రామ్‌లల్లాను గవర్నర్ మొక్కుతుండగా.. వెనుక నుంచి జైశ్రీరామ్ నినాదాలు మార్మోగాయి. రాముడి దర్శనం అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడారు. జనవరిలో రెండుసార్లు అయోధ్యకు వచ్చానని.. ఆ రోజు కలిగిన భావనే ఈ రోజులు కూడా కలిగిందన్నారు. తాను ఎన్నోసార్లు అయోధ్యకు వచ్చానని.. అయోధ్య రాముడిని దర్శించుకోవడం కేవలం సంతోషం మాత్రమే కాదని.. గర్వకారణమని గవర్నర్ పేర్కొన్నారు.
Hon’ble Governor Shri Arif Mohammed Khan at Prabhu Shri Ram Temple Ayodhya: PRO KeralaRajBhavan pic.twitter.com/wCzZCSirLt
— Kerala Governor (@KeralaGovernor) May 8, 2024