Wednesday, January 1, 2025
HomeBusinessMoney Changes | ఈ బ్యాంకుల సేవ‌ల్లో మార్పులు వ‌చ్చాయి.. అవేంటంటే?

Money Changes | ఈ బ్యాంకుల సేవ‌ల్లో మార్పులు వ‌చ్చాయి.. అవేంటంటే?

నేటి నుంచి మ‌నం కొత్త నెల‌లోకి అడుగుపెట్టాం. నెల మారిన‌ట్టే ప‌లు ఆర్థిక‌ప‌ర‌మైన విష‌యాల్లో (Money Changes) కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. దేశంలో ప్ర‌ముఖ ప్రైవేటు రంగ ఆర్థిక సంస్థ‌లైన ఐసీఐసీఐ, య‌స్ బ్యాంకులు తాము అందిస్తున్న సేవ‌ల్లో కొన్ని మార్పులు చేశాయి. తమ పొదుపు ఖాతా చార్జీలు, క్రెడిట్ కార్డు నిబంధనలు (Bank rules) మారాయి. వీటిగురించి తెలియ‌క బ్యాంకుల్లో వెళ్లారో మ‌న జేబుల‌కు చిల్లులు ప‌డిన‌ట్లే..

దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు అయిన ఐసీఐసీఐ.. చెక్ బుక్ జారీ, ఐఎంపీఎస్, ఈసీఎస్ లేదా ఎన్ఏసీహెచ్ డెబిట్ రిటర్న్స్, స్టాప్ పేమెంట్ చార్జీలు సహా వివిధ సేవలకు సర్వీస్ రుసుముల‌ను ఇటీవల సవరించింది. ఇవ‌న్నీ నేటి నుంచే అమ‌ల్లోకి వ‌చ్చాయి. డెబిట్ కార్డుల‌పై ఏడాదికి రూ.200 వరకు వార్షిక రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇక గ్రామీణ ప్రాంతాలకు దీనిని రూ. 99గా నిర్ణయించింది. అదేవిధంగా ఏడాదికి 25 టెక్ లీఫ్స్ ఉచితమని ఆపై ఒక్కోదానికి రూ.4 చార్జీగా వసూలు చేయ‌నుంది. అలాగే ఐఎంపీఎస్ (IMPS) లావాదేవీల చార్జీలను కూడా స‌వ‌రించింది.

ఇక యెస్ బ్యాంక్ విష‌యానికి వ‌స్తే తన పొదుపు ఖాతాల‌పై వివిధ చార్జీల‌ను స‌వ‌రించింది. సేవింగ్స్ ఖాతా నెల‌వారీ బ్యాలెన్స్ చార్టీల‌ను పెంచింది. వీటిని రూ.250 నుంచి రూ.1000గా వ‌సూలు చేయ‌నుంది. సేవింగ్స్ అకౌంట్ ర‌కం, బ్యాంక్ బ్రాంచీ ఉన్న ప్రాంతం, ఖాతాలోని బ్యాలెన్స్ మొత్తాన్ని బ‌ట్టి ఈ చార్జీలు మార‌నున్నాయి. అదేవిధంగా ప్రైవేట్ క్రెడిట్ కార్డ్ రకం మినహా.. తన క్రెడిట్ కార్డు పాలసీలలోని వివిధ అంశాలను సవరించింది. గ్యాస్ చెల్లింపులతో సహా ఒకే స్టేట్‌మెంట్ సైకిల్లో మొత్తం రూ.15 వేల‌ కంటే ఎక్కువ యుటిలిటీ లావాదేవీలు, విద్యుత్, ఇతర సేవలకు జీఎస్​టీతో పాటు 1 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, యెస్ బ్యాంక్ ప్రైవేట్ క్రెడిట్ కార్డును ఉపయోగించి చేసే లావాదేవీలకు ఈ అదనపు రుసుము వర్తించదు.

సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫిక్స్​డ్ డిపాజిట్ స్కీమ్​లో మ‌దుపు చేయడానికి హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ గడువును పొడిగించింది. సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్​డీగా పిలిచే పథకం అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ స్కీమ్​లో పెట్టుబడి పెట్టేందుకు మే 10 వరకు గడువు ఉంది. ఇక
ఐడీఎఫ్​సీ ఫస్ట్ బ్యాంకు యుటిలిటీ ట్రాన్సాక్షన్​ ఫీజును తీసుకొచ్చింది. యుటిలిటీ బిల్లు చెల్లింపులకు సంబంధించి తన క్రెడిట్ కార్డు విధానంలో మార్పును నేటి నుంచి అమ‌లుచేస్తున్న‌ది. దీనిప్రకారం.. స్టేట్‌మెంట్ సైకిల్‌లో రూ.20 వేల‌ కంటే ఎక్కువ యుటిలిటీ బిల్లులకు క్రెడిట్ కార్డు చెల్లింపులకు జీఎస్​టీతో పాటు 1 శాతం సర్ఛార్జ్ వర్తిస్తుంది. అయితే, ఫస్ట్ ప్రైవేట్ క్రెడిట్ కార్డు, ఎల్ఐసీ క్లాసిక్ క్రెడిట్ కార్డు, ఎల్ఐసీ సెలెక్ట్ క్రెడిట్ కార్డును ఉపయోగించి చేసే లావాదేవీలకు ఈ అద‌న‌పు చార్జీ వర్తించదు.

 

RELATED ARTICLES

తాజా వార్తలు