కిల్ ట్రైలరే ఓ రేంజ్…
హాలీవుడ్ జాన్ విక్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఆదరణ, డిమాండ్ ఉంటుందదో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకంటూ ప్రస్తుతం అన్ని దేశాలలోనూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. నో లాజిక్ ఫస్ట్ నుంచి చివరి వరకు వేసుకుంటూ వెళ్లడమే అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే నాలుగు భాగాలుగా వచ్చి ఒకదాన్ని మించి మరోటి కలెక్షన్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డులను తిరగరాసింది. తాజాగా ఇప్పుడు ఆ చిత్రాన్ని తలదన్నేలా ఇంకా చెప్పాలంటే జాన్‌విక్ ఏ మాత్రం పనికి రాదనేలా బాలీవుడ్‌లో ఓ భారీ హిందీ చిత్రం తెరకెక్కింది.
లక్ష్య హీరోగా, నిఖిల్ నగేష్‌భట్ రచన, దర్శకత్వం వహించిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కిల్’ . హాలీవుడ్ జాన్ విక్ సినిమా లాంటి కథతో ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేయగా జనాల్లోకి బాగా చొచ్చుకుపోయింది. ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని తన వైపు తిప్పుకునేలా చేసి సినిమా కోసం వెయిట్ చేస్తున్న యూత్‌ను పిచ్చెక్కి పోయేలా మార్చిందనడంలో ఏం సందేహం లేదు.
ట్రైలర్‌లో ఏంటంటే.. తను ప్రేమించిన తులికకు తనకు ఇష్టం లేకుండా మరొకరితో ఎంగేజ్‌మెంట్ అయిందని, పెళ్లిని ఎలాగైనా అడ్డుకోవాలని ఢిల్లీకి రైలులో బయలుదేరుతాడు ఆర్మీ కమెండో అమృత్. అయితే అదే ట్రైన్‌లో ఓ క్రూరమైన దొంగల ముఠా చేరి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తూ, హింసిస్తూ అందరి దగ్గర దోచుకుంటుంటారు, చంపేస్తుంటారు. దీంతో అమృత్ తన వారిని, ప్రయాణికులను రక్షించేందుకు స్వయంగా రంగంలోకి దిగుతాడు ఇది కథ.
కనిపించిన వస్తువుతో దొరికిన వాడిని దొరికినట్టు నరుక్కుంటూ పోతాడు. జాలీ దయ లేకుండా కలలో కూడా ఊహించని విధంగా వేటాడే విధానం భారీ హింసాత్మక సన్నివేశాలతో సాగుతుంది. కిల్ ట్రైలర్ చూసిన వారంతా ఇప్పుడు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు ఆకాశన్నంటగా ప్రపంచ వ్యాప్తంగా జూలై 5న థియేటర్లలోకి రానుంది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించగా మంచి అప్లాజ్ రావడమే కాక హాలీవుడ్ వారి దృష్టి ఈ చిత్రంపై పడింది.