Monday, December 30, 2024
HomeCinemaKirrak RP| వామ్మో.. రోజాని ఓ రేంజ్‌లో తిట్టేసిన కిరాక్ ఆర్పీ..ఆమె ఏమైనా నేషనల్ అవార్డ్...

Kirrak RP| వామ్మో.. రోజాని ఓ రేంజ్‌లో తిట్టేసిన కిరాక్ ఆర్పీ..ఆమె ఏమైనా నేషనల్ అవార్డ్ ఆర్టిస్టా?

Kirrak RP| ఏపీలో ఎల‌క్ష‌న్స్ ప్ర‌చారాలు చాలా వాడివేడిగా సాగుతున్నాయి. ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకుంటూ రాజ‌కీయం మ‌రింత వేడెక్కిస్తున్నారు. ఈ సారి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంపై అంద‌రి దృష్టి ఉండ‌గా, ఆయ‌న‌కి మ‌ద్దతుగా చాలా మంది సెల‌బ్రిటీలు ముందుకు వ‌స్తున్నారు. ఆయ‌న‌ని విమ‌ర్శించే వారికి గ‌ట్టిగా స‌మాధానం ఇస్తున్నారు.తాజాగా కిరాక్ ఆర్పీ..రోజాని ఓ రేంజ్‌లో విమ‌ర్శించారు. ప్రెస్ మీట్‌లో రిపోర్ట‌ర్.. రోజా జ‌న‌సేన స‌పోర్ట‌ర్స్‌ని బాగా విమ‌ర్శిస్తున్నారు, దానిపై స్పందన ఏంట‌ని అడ‌గ‌గా ఆయ‌న మాట్లాడుతూ… ఆమె మ‌మ్మ‌ల్ని గౌర‌విస్తే రోజా అని పిలుస్తాం, లేదా రోజా అంటాం. ఆమె మ‌మ్మ‌ల్ని అంద‌రిని చిన్న ఆర్టిస్ట్‌లు అంటుంది క‌దా.. ఆమె ఏమైనా నేషనల్ అవార్డ్ ఆర్టిస్టా? లేదంటే ఆ యువరాణి ఏమైనా 10 నేషనల్ అవార్డులు, 10 ఆస్కార్ అవార్డులు సాధించిందా అని ప్ర‌శ్నించారు.

నువ్వు మ‌మ్మ‌ల్ని చిన్న ఆర్టిస్ట్‌లు అంటున్నావ్ కదా, నీకు క‌నుక ద‌మ్ముంటే గెట‌ప్ శీను చేసే ఒక్క క్యారెక్ట‌ర్ అయిన చేసి చూపించు అని స‌వాల్ చేశాడు. ఇక సుధీర్ మ్యాజిక్ షోలు చేసి ఆ ఛ‌రిష్మాతో హీరోగా మారాడు. వాడికి నీ క‌న్నా 10 రెట్లు ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది , వాడితో నువ్వు పోటీ ప‌డ‌తావా? ఇక ఆది వచ్చి జబర్దస్త్ చరిత్రనే మార్చాడు. నువ్వు పంచులకు జడ్జిమెంట్ ఇస్తే చాలు. ఆది అందరినీ గంటపాటు ఏకధాటిగా నవ్వించి ఓ ట్రెండ్ సెట్ట‌ర్‌గా మారాడు. మ‌రి అత‌నితో నువ్వు పోటీ ప‌డ‌తావా? న‌ఈ జీవితంలో ఎప్పుడైన ఈ ముగ్గురికి ఉన్న ఛ‌రిష్మా చూశావా? నిన్ను ఎవ‌రు ఏమి అన‌నప్పుడు కూడా నీకు ఎందుకుంత ఉనికి? నీ ప‌ని నువ్వు చూసుకుంటే సరిపోతుంది క‌దా అని ఫైర్ అయ్యాడు.

నేను చెబుతున్నాను క‌దా, ఈ సారి ఎమ్మెల్యేల‌లో ఓడిపోయే మొద‌టి వ్య‌క్తి మా యువ‌రాణే అంటూ జోస్యం చెప్పాడు ఆర్పీ. నీకు నగరిలో డిపాజిట్లు కూడా రావు. మేము ఎప్పుడూ నీ గురించి తప్పుగా మాట్లాడలేదు. వాళ్లు వెళ్లి అక్కడ సపోర్ట్ చేసుకుంటే నీకెందుకు అంటూ రోజాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మెగా ఫ్యామీలీలో 7 గురు హీరోలు ఉంటే నీకు ఎందుకు, నీ ద‌గ్గ‌ర 70 మంది రౌడీలు ఉన్నారు.. ప్ర‌తి ఒక్క‌రు నీలాగే దిగ‌జారిపోయి అంద‌రి వెన‌క తిరుగుతూ బ్ర‌తుకుతారు అనుకుంటున్నావా? నోరు మూసుకొని నీ పబ్లిసిటీ నువ్వు చేసుకో. నువ్వు చేసినా ఓడిపోతావు, చేయకపోయినా ఓడిపోతావు. కనీసం జనసేనకు అయినా వచ్చి అక్కడ మద్దతు పలుకు. నీ బ్రతుకు బాగుంటుంది అని కిరాక్ ఆర్పీ వార్నింగ్ ఇచ్చాడు.

RELATED ARTICLES

తాజా వార్తలు