KKR vs PBKS| ఐపీఎల్ 2024లో భారీ స్కోర్స్ నమోదు అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి స్కోరు 250 దాటింది. పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 261 పరుగులు చేయగా, ఆ లక్ష్యాన్ని పంజాబ్ జట్టు ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ పంజాబ్ బౌలర్స్‌కి చుక్కలు చూపించింది. సాల్ట్ 37 బంతుల్లోనే 6 సిక్స్‌లు, 6 ఫోర్లతో 75 రన్స్ చేశాడు. మరోవైపు నరైన్ 32 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్స్ లతో 71 రన్స్ చేశాడు. ఆ తర్వాత వెంకటేశ్ అయ్యర్ 23 బంతుల్లోనే 39 రన్స్ చేశాడు. మధ్యలో రసెల్ 12 బంతుల్లోనే 24 రన్స్ చేసాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 10 బంతుల్లోనే 28 రన్స్ చేశాడు.
వచ్చిన ప్రతి బ్యాట్స్‌మెన్ విజృంభించడంతో కేకేఆర్ భారీ స్కోరే చేసింది. ఈ స్కోరు చూసిన కేకేఆర్ అభిమానులు మ్యాచ్ గెలవడం పక్కా అని అనుకున్నారు. కాని పంజాబ్ బ్యాట్స్‌మెన్స్ ఊచకోతకి కేకేఆర్ బౌలర్స్ తేలిపోయారు. పంజాబ్ 262 పరుగుల లక్ష్యాన్ని కూడా సునాయాసంగా చేధించడం విశేషం. జానీ బెయిర్ స్టో(48 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్స్‌లతో 108 నాటౌట్) అజేయ సెంచరీతో అదరగొట్టగా .. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 54) , శషాంక్ సింగ్(28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో విరుచుకుపడ్డారు.ఇర కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ ఒక్కడికే వికెట్ దక్కింది.
గతంలో 259 పరుగులతో సౌతాఫ్రికా పేరిట ఉన్న అత్యధిక పరుగుల చేజింగ్ రికార్డును ఇప్పుడు పంజాబ్ కింగ్స్ బ్రేక్ చేసింది. అంతేకాకుండా ఈ మ్యాచ్‌తో టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్స్ లు నమోదైన మ్యాచ్ అయింది. కేకేఆర్ 18 సిక్స్ లు బాదగా.. పంజాబ్ కింగ్స్ 24 కలిపి మొత్తంగా 42 సిక్స్ లు బాదారు. మొత్తానికి ఈ మ్యాచ్ మాత్రం ప్రేక్షకులకి మంచి మజా అందించింది. ఇలాంటి మ్యాచ్‌లు రానున్న రోజులలో ఇంకెన్ని జరుగుతాయో చూడలి.