Sunday, December 29, 2024
HomeSpiritualKoil Alwar Thirumanjanam | పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Koil Alwar Thirumanjanam | పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Koil Alwar Thirumanjanam | తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 22 నుంచి 24 వరకు వార్షిక వసంతోత్సవాలు జరుగనున్నాయి. వేడుకల సందర్భంగా ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కార్యక్రమంలో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. తిరిగి ఉదయం 9.30 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.

RELATED ARTICLES

తాజా వార్తలు