చేవెళ్ల నియోజకవర్గంలో నా గెలుపునకు కాంగ్రెస్ పార్టీ హెల్ప్ చేసిందని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy)సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్‌లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాకు ఒక వరం ఇచ్చింది. అదేందంటే.. మొదట సునీతా మహేందర్ రెడ్డిని ప్రకటించారు. ఆమె పోటీలో ఉంటే టఫ్ ఉంటుండే. ఎందుకంటే వారికి అంతట పరిచయాలు ఉన్నాయి. రంజిత్ రెడ్డికి పరిచయాలు ఎక్కువ లేవు. నియోజకవర్గం అసలే తెలియదు. కాబట్టి చేవెళ్లలో నా గెలుపు సునాయసం అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇక చేవెళ్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపున కాసాని జ్ఞానేశ్వర్, కాంగ్రెస్ తరపున రంజిత్ రెడ్డి, బీజేపీ తరపున కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రంజిత్ రెడ్డి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై గెలిచారు. అసెంబ్లీ ఫలితాల వరకు కూడా ఆయన బీఆర్ఎస్‌లోనే కొనసాగారు. ఎంపీ ఎన్నికలు రాగానే గులాబీని వీడి హస్తం పార్టీలో చేరారు. ఇక సునీత మహేందర్ రెడ్డి చేవెళ్ల నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఆమె పేరును మల్కాజ్‌గిరి పార్లమెంట్‌కు కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. రంజిత్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ కేటాయించింది కాంగ్రెస్ పార్టీ.
నా గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ హెల్ప్ చేసింది
చేవెళ్లకు ముందు సునీత మహేందర్ రెడ్డి పేరు ప్రకటించింది. సునీత మహేందర్ రెడ్డి ఐతే నాకు పోటీ గట్టిగా ఉండేది. ఇప్పుడు నా గెలుపు ఈజీగా అయ్యింది – బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Video Credits – Abn pic.twitter.com/uhtr6qzjly
— Telugu Scribe (@TeluguScribe) May 7, 2024