Thursday, April 3, 2025
HomeTelanganaKoppula Eshwar | ఎమ్మెల్యే సంజయ్‌ని జగిత్యాలలో తిరుగనివ్వం : మాజీ మంత్రి కొప్పుల

Koppula Eshwar | ఎమ్మెల్యే సంజయ్‌ని జగిత్యాలలో తిరుగనివ్వం : మాజీ మంత్రి కొప్పుల

హైదరాబాద్‌ : కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మోసం చేశారు. కష్ట కాలంలో పార్టీని మోసం చేసి స్వార్థంతో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యే సంజయ్‌ని జగిత్యాలలో తిరుగనివ్వమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హెచ్చరించారు. సంజయ్‌ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే సంజయ్‌ ఇంటిని ముట్టడించాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. దిష్టి బొమ్మలను తగులబెట్టారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ.. ఉద్యమంలో పాల్గొనకున్నా ఆయనకు కేసీఆర్‌ పిలిచి మరీ టికెట్‌ ఇచ్చారు. ఎమ్మెల్సీ కవిత చంటిపిల్లాడిలా అతడిని ఊరూరు తిప్పి ఎమ్మెల్యేగా గెలిపించారు. కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేసి జగిత్యాల ప్రజలను సంజయ్‌ మోసం చేశాడని మండిపడ్డారు. రూ.40 కోట్లు తీసుకొని కాంగ్రెస్‌లో చేరాడని ఆరోపించారు. అధికారం కోల్పోగానే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కడియం శ్రీహరి పార్టీని వీడటం దారుణమన్నారు.

పోచారానికి కేసీఆర్‌ ఎంతో విలువ ఇచ్చారని గుర్తు చేశారు. వ్యక్తగత స్వార్థంతోనే పార్టీ మారుతున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులను సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఆపాలన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌ తన పదవికి రాజీనామా చేసి భేషరతుగా ప్రజలకు క్షమాణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే జగిత్యాలలో తిరుగనివ్వమని హెచ్చరించారు.

జీవన్‌ రెడ్డి రాజీనామా?
కాగా, మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి (MLC Jeevan Reddy) అలకబూనారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ పార్టీలో చేర్చుకోవడంపై ఆగ్రహంగా ఉన్నారు. ఆయన చేరికపై పార్టీ అధిష్ఠానం కనీసం తనకు సమాచారం ఇవ్వకపోవడంతో అసనం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, సంజయ్‌ చేరికపై కాంగ్రెస్‌ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో సోమవారం ఉదయం నుంచే జీవన్‌రెడ్డి ఇంటికి పార్టీ నాయులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. అయితే ఈ విషయమై పార్టీ అధిష్ఠానం ఆయనతో మాట్లాడుతున్నట్లు సమాచారం.

RELATED ARTICLES

తాజా వార్తలు