Saturday, January 4, 2025
HomeNationalKozhikode | వేలు తీయ‌మంటే.. నాలుకకు శ‌స్త్ర చికిత్స‌.. నాలుగేళ్ల చిన్నారి న‌ర‌క‌యాత‌న‌

Kozhikode | వేలు తీయ‌మంటే.. నాలుకకు శ‌స్త్ర చికిత్స‌.. నాలుగేళ్ల చిన్నారి న‌ర‌క‌యాత‌న‌

Kozhikode | తిరువ‌నంత‌పురం : ఆ అమ్మాయికి పుట్టుక‌తోనే ఓ చేతికి ఆరు వేళ్లు వ‌చ్చాయి. అయితే నాలుగేండ్ల వ‌య‌సున్న ఆ చిన్నారికి ఆరో వేలు తీయించేందుకు ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. కానీ ఆరో వేలు తొల‌గించ‌కుండా నాలుక‌కు శ‌స్త్ర చికిత్స చేశారు. దీంతో ఆ చిన్నారి న‌ర‌క‌యాత‌న అనుభవిస్తోంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. కేర‌ళ‌లోని కోజికోడ్‌కు చెందిన ఓ నాలుగేళ్ల పాప చేతికి ఆరు వేళ్లు ఉన్నాయి. ఆ వేలిని తొల‌గించాల‌ని కోజికోడ్ ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీ వైద్యుల‌ను పాప త‌ల్లిదండ్రులు సంప్ర‌దించారు. గురువారం శ‌స్త్ర చికిత్స నిర్వ‌హించి, ఆరో వేలిని తొల‌గిస్తామ‌ని వైద్యులు చెప్పారు. దీంతో పాప‌ను నిన్న ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లోకి తీసుకెళ్లారు. కాసేప‌టి త‌ర్వాత బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. చిన్నారిని చూసి త‌ల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఎందుకంటే ఆమె వేలిని తొల‌గించ‌లేదు. నోట్లో మాత్రం దూది నొక్కారు.

మెడిక‌ల్ కాలేజీ ఉన్న‌తాధికారుల‌ను ఆరా తీయగా, వైద్యుడి నిర్ల‌క్ష్యంతో నాలుక‌కు శ‌స్త్ర చికిత్స చేసిన‌ట్లు తెలిపారు. ఈ విష‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం కావ‌డంతో త‌క్ష‌ణ‌మే ప్ర‌భుత్వం స్పందించింది. ప్రాథ‌మిక విచార‌ణ ఆధారంగా విధుల్లో నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శించిన డాక్ట‌ర్ బెజోన్ జాన్స‌న్‌ను స‌స్పెండ్ చేసిన‌ట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి ప్ర‌క‌టించారు.

RELATED ARTICLES

తాజా వార్తలు