మరో చేనేత కార్మికుడు ఆత్మహత్య..
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే : కేటీఆర్
కాంగ్రెస్ సర్కారు పరిపాలనా వైఫల్యం వల్లే సిరిసిల్లలో మరో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక ఉరి వేసుకుని పల్లె యాదగిరి అనే కార్మికుడు ఆత్మ హత్య చేసుకోవడంపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.