టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌కు ఫోన్ చేసిన కేటీఆర్
టీఎస్‌పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేశారు. ఏఈఈ సివిల్ ఉద్యోగుల నియామకాలకు సంబంధించి ఎంపిక జాబితాను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేటీఆర్‌ను నందినగర్‌లోని ఆయన నివాసంలో ఏఈఈ (సివిల్) రాసిన అభ్యర్థులు కలిశారు.