Thursday, January 2, 2025
HomeTelanganaKTR | ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి : కేటీఆర్

KTR | ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి : కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవటం లేదని ఈ విషయంలో ప్రభుత్వం పై పోరాటానికి తమకు అండగా ఉండాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిన నిరుద్యోగ అభ్యర్థులు.

వారితో సమావేశమై ఆ తర్వాత మీడియా తో మాట్లాడిన కేటీఆర్.

కేటీఆర్ కామెంట్స్.

🔹నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చి ఇప్పుడు వాటిని పట్టించుకోవటం లేదు.

🔹ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ పేరుతో పెద్ద ఎత్తున అడ్వర్టైజ్ మెంట్లు అన్ని పత్రికల్లో ఇచ్చారు.

🔹దాదాపు 10 పరీక్షలకు సంబంధించి డేట్లతో సహా నోటిఫికేషన్లు అంటూ తేదీలు ప్రకటించారు.

🔹వాటికి సంబంధించి ఒక్క నోటిఫికేషన్ ను విడుదల చేయలేదు. వెంటనే ఆ నోటిఫికేషన్లను విడుదల చేయాలి.

🔹ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో గ్రూప్-2 లో 2 వేల ఉద్యోగాలు పెంచుతామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు.

🔹అధికారంలోకి వస్తే గ్రూప్-3 లో వేలాదిగా ఉద్యోగాలు పెంచుతామని అన్నారు.

🔹మొదటి కేబినెట్ భేటీలోనే మెగా డీఎస్సీ అని చెప్పి నిరుద్యోగులను దగా చేశారు.

🔹గ్రూప్-1 కు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన దానికి కేవలం 60 ఉద్యోగాలు యాడ్ చేశారు.

🔹ఉద్యోగాలు పెంచమని అడిగితే సాంకేతిక కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

🔹కానీ ఈ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో వదలదు. అన్ని చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం.

🔹నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటూ వారికోసం పోరాడుతుంది.

🔹గ్రూప్-1 మెయిన్స్ కు సంబంధించి 1 : 100 అభ్యర్థులను ఎంపిక చేయాలి.

🔹ఇప్పుడున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు గతంలో ఈ డిమాండ్ చేశారు.

🔹కానీ ఇప్పుడు ఎందుకు అభ్యర్థులకు మేలు చేసే విధంగా గ్రూప్-1 మెయిన్స్ 1 : 100 పిలవటం లేదు.

🔹టెట్, గ్రూప్-1 ప్రిలిమ్, డీఎస్సీ, గ్రూప్-2, గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్ -3 ఎగ్జామ్ లు వెంట వెంటనే ఉన్నాయి.

🔹చాలా మంది విద్యార్థులు అన్ని ఎగ్జామ్స్ రాస్తారు కనుక ఎగ్జామ్ ఎగ్జామ్ కి సరిపడేంత సమయం ఇవ్వాలి.

🔹ఏడాది లో 2 లక్షల ఉద్యోగాలని ఏదైనా చెప్పారో వాటిని వెంటనే రిక్రూట్ చేయాలని ప్రభుత్వాని డిమాండ్ చేస్తున్నాం.

🔹అదే విధంగా జాబ్ క్యాలెండర్ ను కూడా ఈ ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి.

🔹లేదంటే బీఆర్ఎస్ నాయకులందరం నిరుద్యోగుల పక్షాన రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీస్తాం.

🔹ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఏ నిరుద్యోగులైతే ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారో..వారే ప్రభుత్వాన్ని గద్దె దించే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నా.

RELATED ARTICLES

తాజా వార్తలు