Sunday, December 29, 2024
HomeTelanganaKTR | అది త‌ప్ప‌ని నిరూపిస్తే.. తెల్లారేస‌రికి రాజీనామా చేస్తా.. బీజేపీ నేత‌ల‌కు కేటీఆర్ స‌వాల్

KTR | అది త‌ప్ప‌ని నిరూపిస్తే.. తెల్లారేస‌రికి రాజీనామా చేస్తా.. బీజేపీ నేత‌ల‌కు కేటీఆర్ స‌వాల్

KTR | రాజ‌న్న సిరిసిల్ల : తెలంగాణ బీజేపీ నేత‌లు బండి సంజ‌య్, కిష‌న్ రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స‌వాల్ విసిరారు. అదానీ, అంబానీకి సంబంధించిన ప‌ద్నాలుగున్న‌ర ల‌క్ష‌ల కోట్ల రుణాలు మోదీ మాఫీ చేశారు. ఇది త‌ప్ప‌ని నిరూపిస్తే రేపు తెల్లారేసరికి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని కేటీఆర్ స‌వాల్ చేశారు. సిరిసిల్ల ప‌ట్టణంలోని శాంతినగర్ చౌరస్తా, గాంధీ చౌక్, తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్స్‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

ఈ ప‌దేండ్ల‌లో పేద‌వాళ్ల ర‌క్తం పీల్చి ప్ర‌ధాని మోదీరూ. 30 ల‌క్ష‌ల కోట్లు దోచుకున్నార‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. పేద‌ల నుంచి వ‌సూళ్లు చేసిన న‌గ‌దులో.. అదానీ, అంబానీకి చెందిన ప‌ద్నాలుగున్న‌ర ల‌క్ష‌ల కోట్ల రుణాల‌ను మాఫీ చేశార‌ని గుర్తు చేశారు. తాను చెప్పింది త‌ప్ప‌ని కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ లేదా ఇత‌ర బీజేపీ నేత‌లు ఎవ‌రైనా నిరూపిస్తే రేపు తెల్లవారేసరికి తెలంగాణ తల్లి సాక్షిగా త‌న‌ రాజీనామాను బీజేపీ నాయకుల ముఖ‌నా కొడుతా అని కేటీఆర్ తేల్చిచెప్పారు.

కేసీఆర్ మ‌ళ్లీ సీఎం కావాలంటే..

నేత కార్మికుల కోసం రూ. 3 వేల కోట్లు ఖర్చు చేసుకొని కార్మికులను కాపాడుకున్నామ‌ని కేటీఆర్ గుర్తు చేశారు. సిరిసిల్ల పట్ట‌ణాన్ని అతి సుంద‌రంగా తీర్చిదిద్దుకున్నాం. మోచేతికి బెల్లం పెట్టీ మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 100 రోజుల్లో రైతు రుణమాఫీ, ఫించన్లు వచ్చాయా..? ఓట్లు చేసుకునేటప్పుడు ఒక లెక్క.. ఓట్లు వేయించుకున్నాకా ఒక లెక్క ఉంది కాంగ్రెస్ పార్టీ తీరు. కేసీఆర్ మ‌ళ్లీ సీఎం కావాలంటే 13వ తేదీన కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి. తెలంగాణ‌ను శాసించే అధికారం వ‌స్తుంది.

అక్కరకు రానీ సుట్టాలకు ఎందుకు ఓటు వేయాలి..?

రాముడు అందరి వాడు. మతం పేరుతో బీజేపీ నేత‌లు ఓట్ల రాజకీయం చేస్తున్నారు. వేములవాడ రాజన్న, కొండగట్టు దేవాలయాలు బీజేపీ పుట్టక ముందు నుండే ఉండేవి. సిరిసిల్లలో అనేక అభివృద్ధి పనులు చేసినా, బీజేపీ ఒక్క పని చేసిందా..? శిలాఫలకం అన్న వేసిందా..? మ‌రి వారికి ఎందుకు ఓటు వేయాలి. మోడీ ముడి చమురు ధరలు తగ్గినా పెట్రోలు, డీజిల్ రెట్లపై పన్నులు వేసి వసూలు చేసారు. మనకు ప్రధాన మంత్రి కాదు పిరమైన ప్రధాన మంత్రి. అక్కరకు రానీ సుట్టాలకు ఎందుకు ఓటు వేయాలి అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

RELATED ARTICLES

తాజా వార్తలు