Friday, April 4, 2025
HomeTelanganaకాంగ్రెస్ పాలనలో.. ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో..! కేటీఆర్ ట్వీట్

కాంగ్రెస్ పాలనలో.. ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో..! కేటీఆర్ ట్వీట్

హైద‌రాబాద్ : ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. సీఎం రేవంత్ పాల‌న‌లో అన్న‌దాత‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఆరు ద‌శాబ్దాల క‌న్నీటి దృశ్యాలు.. ఆరు నెల‌ల కాంగ్రెస్ పాల‌న‌లోనే ఆవిష్కృతం అయ్యాయ‌ని కేటీఆర్ తెలిపారు.

గ‌త ప‌దేండ్ల‌లో క‌రెంట్ కోత‌లు లేవు కానీ.. ఈ ఆరు నెల‌ల్లో క‌రెంట్ కోత‌లు చూస్తున్నామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ సబ్ స్టేష‌న్ల‌ను రైతులు ముట్టడిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇన్వ‌ర్ట‌ర్లు, జ‌న‌రేట‌ర్లు మోత మోగుతున్నాయ‌న్నారు. సాగునీరు లేక పంట‌లు ఎండిపోయాయి. ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు చూస్తున్నామ‌ని కేటీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

పాత అప్పు కట్టాలని రైతులకు బ్యాంక‌ర్లు నోటీసులు జారీ చేసిన ఘ‌ట‌న‌లు చూశామ‌న్నారు. రైతుబంధు కోసం నెల‌ల త‌ర‌బ‌డి వేచి చూశామ‌న్నారు. ఇప్పుడు క‌నీసం త‌డిసిన ధాన్యాన్ని కొనే దిక్కులేని దుస్థితి దాపురించింది.

చివరికి ఇవాళ జోగిపేటలో..

విత్తనాల కోసం రైతుల మొక్కులు… క్యూలైన్‌లో పాస్ బుక్కులు చూశాం. కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు.. అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు.. ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో.. ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో అని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు