రాష్ట్రంలో పేరుకేమో ప్రజాపాలన.. చేస్తున్నది ప్రతీకార పాలన అని సీఎం రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నిప్పులు చెరిగారు. హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న జూపల్లి కృష్ణారావును మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్మీపల్లికి చేరుకున్నారు. శ్రీధర్ రెడ్డి మృతదేహానికి కేటీఆర్ నివాళులర్పించారు. శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
శ్రీధర్ రెడ్డి హత్యకు జూపల్లి కృష్ణారావే బాధ్యత వహించాలి. ఇది మొదటి హత్య కాదు. పేరుకేమో ప్రజాపాలన.. చేస్తున్నది ప్రతీకార పాలన. ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో వత్తాసు పలకని వారి మీద ప్రతీకారం తీర్చుకునే దిక్కుమాలిన పాలన.. ఇది కాంగ్రెస్ పాలన. ఈ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రాష్ట్రంలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని మంత్రి జూపల్లి కొల్లాపూర్‌లో తీసుకొచ్చారు. జనవరిలో మల్లేష్ యాదవ్, ఇప్పుడు శ్రీధర్ రెడ్డి హత్యకు కారణమయ్యారు జూపల్లి. ఒకటే నియోజకవర్గంలో నాలుగు నెలల వ్యవధిలో రెండు హత్యలు జరిగాయంటే మంత్రి ప్రమేయం, ప్రోద్బలం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మంత్రి జూపల్లిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
స్థానికంగా ఉండే పోలీసు వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు. వరుస హత్యలపై ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలి. లేదంటే జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలి. ఈ హత్యల్లో ప్రభుత్వ పాత్ర, మంత్రి పాత్ర లేకపోతే నిష్పక్షపాతంగా విచారణ జరిగేందుకు సహకరించాలి. కొల్లాపూర్ ప్రాంతంలో హింసాయుతమైన సంస్కృతి కనబడుతుంది.. గ్రామీణ ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతున్నారు.. చెలరేగిపోతున్నారు.. అయినా పోలీసులు ప్రేక్షపాత్ర వహిస్తున్నారు. అవసరమైతే పికెట్లు, క్యాంపులు ఏర్పాటు చేయాలని డీజీపీని మా నాయకులు కలిశారు అని కేటీఆర్ గుర్తు చేశారు.
శ్రీధర్ రెడ్డి హత్యకు గురైనట్టు ఉదయం 5.30కు పోలీసులకు ఫోన్ చేస్తే గంటన్నర తర్వాత వచ్చి ప్రేక్షకపాత్ర పోషించారు. ఈ కేసులో ముందుగా ఎస్ఐని సస్పెండ్ చేయాలి. మా కార్యకర్తలు కూడా రగిలిపోతున్నారు. ఇదే దాడుల సంస్కృతి కొనసాగితే మేం కూడా నియంత్రించలేం. ఈ సంస్కృతి రాష్ట్రానికి మంచిది కాదు. ఇలాగే హత్య రాజకీయాలు కొనసాగితే మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టిడికి కూడా వెనుకాడం. శ్రీధర్ రెడ్డి తండ్రిని సముదాయించలేకపోతున్నాం. శ్రీధర్ రెడ్డి హత్య వెనుకాల జూపల్లి కృస్ణారావు ఉన్నాడని కేసు పెడితే, మంత్రి పేరు ఉపసంహరించుకోవాలని పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
హత్యలు, దాడులు, కేసులు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే బెదిరింపులు, బైండోవర్లు ఇదేనా నీ చిల్లర రాజకీయం అని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ సంస్కృతి కొనసాగితే తెలంగాణకు మంచిదికాదు. ఈ హత్య రాజకీయాలకు తెర దించాలి. శ్రీధర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రజాపాలన అంటూ చేస్తుంది ప్రతీకార పాలన
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలకని వాళ్లపై ప్రతీకారం తీసుకునే పాలన కాంగ్రెస్ పాలన.
ఈ దారుణమైన హత్యకు బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే. మంత్రి జూపల్లి కృష్ణ రావు ప్రమేయం లేకుండా నాలుగు నెలల్లో రెండు హత్యలు జరగవు. సీఎం… pic.twitter.com/cXCzj8sRr8
— Telugu Scribe (@TeluguScribe) May 23, 2024