Click to view Janapadham_E-Paper
ఢిల్లీ డీల్
బెడిసికొట్టిందా…
బేరం కుదిరిందా
వార్తల్లో వాస్తవం ఎంత
న్యూ ఢిల్లీ
—
భారత రాష్ట్ర సమితి నేతల ఇటీవల వరుస ఢిల్లీ పర్యటనలు రివర్స్ కొడుతున్నాయి. మరో నాలుగు రోజులు ఢిల్లీలోనే ఉండి తెలంగాణ పాలిటిక్స్ లో వేడి పుట్టిద్దామనుకున్న లీడర్ల ప్లాన్లు బెడిసికొట్టినట్టే కనిపిస్తున్నాయి. తాజాగా బీజేపిలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని, అదీ ఢిల్లీ ఎన్నికల తర్వాత జరుగొచ్చని ఈ పాటికే చర్చలు ముగిసాయని…బిఆర్ఎస్ పార్టీ ఇక చరిత్రకే పరిమితం కాబోతుందని ప్రముఖ జర్నలిస్ట్ రవిప్రకాశ్ విడుదల చేసిన ఒక వీడియో పొలిటికల్ సర్కిల్స్ లో హీటాట్ చక్కర్లు కొడుతున్నది. ఢిల్లీలో డీల్ కుదిరిందట కదా…అనే చర్చ పార్టీలో విస్తృతంగా నడుస్తున్నది. దీంతో దెబ్బకు ఢిల్లీ ఖాలీ చేసి తెలంగాణ భవన్ కొచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి పార్టీ నేతల్లో నెలకొన్నది. నాలుగైదు రోజులు పార్టీ ఎమ్మెల్యేలతో ఢిల్లీలో మకాం వేసి రహస్య భేటీలు జరుపుతోన్న లీడర్ల కదలికలను పసిగట్టిన ఎమ్మెల్యేలే ఆ జర్నలిస్ట్ కు లీకిచ్చి వార్తలు రాయించారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఎప్పట్నుంచే కసి కోపంతో రగిలిపోతున్న సదరు జర్నలిస్ట్ సమయం సందర్భం చూసి బాంబు లాంటి వార్త విసిరాడు. దీంతో బిఆర్ఎస్ నాయకత్వం అంతా సమాదానం చెప్పుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. నిజానికి లిక్కర్ కేసులో జైలు జీవితం గడుపుతున్న ఎంఎల్సీ కవిత ములఖాత్ కోసం, బేయిల్ కోసం నేతలంతా ఢిల్లీ వెళ్లారు. అంతకుముందే ఢిల్లీ సీనియర్ న్యాయకోవిదులతో కెసిఆర్ తన ఫాం హౌజ్ లో చర్చలు జరిపారు. అటు కవిత బేయిల్, ఇటు ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు అనుభవజ్ఞులైన న్యాయ నిపుణులతో మంతనాలు సాగించారు. అయితే తాజాగా ఇప్పట్లో బేయిల్ లభించదని, బేయిల్ పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. అయితే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు హైకోర్టులో కొనసాగుతున్న క్రమంలోనే సుప్రీంకోర్టులో మరో కేసు వేయాలని అదీ తోటి ఎమ్మెల్యేలకు తెలువాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీకెల్లి బిఆర్ఎస్ నాయకత్వం షో చేసింది. ఉప ఎన్నికలతో రాజకీయ వేడిని పుట్టిస్తున్నామని చెప్పింది. పార్టీ ఫిరాయించిన 10 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు ప్రతీ అవకాశాన్ని వాడుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్ సహా పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇదే అంశంపై ఢిల్లీలో మకాం వేసి మంతనాలు జరుపుతున్నట్టు బావించారు. అయితే వరుసగా ఢిల్లీలోనే ఉండి కొంత పారదర్శకత, మరికొంత గోప్యతగా ఉండడంతో ఏదో జరుగుతోందని పుకార్లు షికార్లు చేశాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా ఇదే చర్చ తెరపైకి వచ్చింది. బీజేపితో సీక్రెట్ డీల్ అనే వాసన వార్తను ప్రముఖ జర్నలిస్ట్ కు అందడంతో సోషల్ మీడియాలో తన దైన శైలిలో ప్రజంట్ చేశారు.
రవి కసి తీర్చుకుంటున్నర
—-
ప్రముఖ టీవి చానల్ సిఇవో గా పనిచేసిన రవి ప్రకాశ్ తెలంగాణ ఉద్యమంలో వ్యతిరేక బావజాలంతోనే ఉన్నారు. రాష్ట్ర సాదించుకున్న తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా వార్తలు ప్రసారం చేసారన్న అపవాదు ఉన్నది. దీంతో సీఎంగా ఉన్న కెసిఆర్ వరంగల్ వేదికగా ఆ చానల్ ను వంద మీటర్ల లోపు పాతిపెట్టామని హెచ్చరించి నిషేదాలు జారీ చేశారు. అప్పట్నుంటి కెసిఆర్ వర్సెస్ రవి ప్రకాశ్ లా యుద్దం సాగుతూనే ఉన్నది. ఈ లోగా ఆ సంస్ధను ప్రముఖ పారిశ్రామికేత్త రామేశ్వర్ రావు అండ్ కో కొనుగోలు చేయడం, రవిని బయటకు పంపడం వంటివి జరిగాయి. కేవలం కెసిఆర్ వల్లే తన కేరీర్ బుగ్గిపాలైందనే ఆక్రోశంతో రవి ప్రకాస్ ఉన్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్న కెటిఆర్ ఇతర పెద్దలతో మంతనాలు సాగించి ఓ చానల్ కూడా ప్లాన్ చేసినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే బిఆర్ఎస్ నాయకత్వం రవిని అంతగా నమ్మకపోవడంతో పాటు ఆ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెల్లలేకపోయిందన్న అపవాదు ఉన్నది. దీంతో రవి మరింత ఆక్రోశంతో సందర్భం వచ్చిన ప్రతీసారి బిఆర్ఎస్ నాయకత్వానికి అడ్డగా వార్తలు ప్రజంట్ చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే 2023 ఎన్నికలకు ముందు ప్రీ పోల్ సర్వే, పార్లమెంట్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ లో బిఆర్ఎస్ గ్రాఫ్ దారుణందా పడిపోతుందని చెప్పేశారు. ఈ వార్తలు కొంత ప్రబావితం చేశాయని కూడా పార్టీ నాయకత్వం బావిస్తోంది. తాజాగా కవితకు బేయిల్ రావాలంటే కెసిఆర్ కాంప్రమైజ్ కావాల్సిందేనని బీజేపితో మంతనాలు సాగుతున్నాయనే ప్రచారాన్ని వార్తలకెక్కించి మరింత కిక్కు పుట్టించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
24 గంటల్లో టైం ఇస్తున్నా…_ కెటిఆర్
లీగల్ యాక్షన్ ఉంటుంది..
హైదరాబాద్ : బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదు.. అలా తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ పైన, విలీనం లాంటి ఎజెండా పూరిత దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకి వివరణ ఇవ్వాలి. లేదంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని కేటీఆర్ హెచ్చరించారు. 24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ మాది. ఇవన్నీ దాటుకొని 24 ఏండ్ల పాటు నిబద్ధతతో, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్. సాధించుకున్న తెలంగాణ సగర్వంగా నిలబెట్టుకొని, అభివృద్ధిలో అగ్రపథాన నిలిపాము అని కేటీఆర్ తెలిపారు.
ఆత్మగౌరవం, అభివృద్ధిని పర్యాయపదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాము. కోట్లాది గొంతుకలు, హృదయాలు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం పోరాడుతున్నాయి కాబట్టే ఇది సాధ్యమైంది. ఎప్పటిలానే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది.. పోరాడుతుంది. ఇప్పటికైనా అడ్డగోలు అసత్యాలను, దుష్ప్రచారాలను మానుకోవాలి. పడతాం, లేస్తం, తెలంగాణ కోసమే పోరాడుతాం… కానీ తలవంచం.. ఎన్నటికైనా ఎప్పటికైనా అని కేటీఆర్ తేల్చిచెప్పారు.