కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన చంద్రబాబు.. మోదీ వద్ద తన డిమాండ్లను నెరవేర్చుకునే పని మొదలుపెట్టాడు. జులై తొలి వారంలో మోదీ వద్ద చంద్రబాబు భారీ డిమాండ్ ఉంచినట్లు వార్తలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు రాజధాని నిర్మాణం కోసం 1 ట్రిలియన్ రూపాయాలు కావాలని డిమాండ్ చేసినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు పట్టం కట్టిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రాంతీయ పార్టీ టీడీపీకే మెజార్టీ సీట్లు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు నాయుడు కీలకమయ్యారు. ఎన్డీఏ కూటమి చంద్రబాబు, నితీశ్ కుమార్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ రెండు ప్రాంతీయ పార్టీలు కనుక ఎన్డీఏకు మద్దతు ప్రకటించకపోతే కేంద్రంలో మోదీ మరోసారి ప్రధాని అయి ఉండేవాడు కాదు. మొత్తానికి చంద్రబాబు మద్దతుతో మోదీ గట్టెక్కారనే విషయం అందరికీ తెలుసు.
ఇక కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన చంద్రబాబు.. మోదీ వద్ద తన డిమాండ్లను నెరవేర్చుకునే పని మొదలుపెట్టాడు. జులై తొలి వారంలో మోదీ వద్ద చంద్రబాబు భారీ డిమాండ్ ఉంచినట్లు వార్తలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు రాజధాని నిర్మాణం కోసం 1 ట్రిలియన్ రూపాయాలు కావాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. అంటే అక్షరాలా ఒక లక్ష కోట్ల రూపాయాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేటాయించాలని మోదీని చంద్రబాబు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్తా కథనం బ్లూమ్‌బర్గ్ అనే వెబ్‌సైట్‌లో ప్రచురితమైంది.
ఈ కథనాన్ని మనేకా దోశి అనే జర్నలిస్టు తన ట్వీట్టర్ వాల్‌పో పోస్టు చేశారు. ఏపీకి 1 ట్రిలియన్ రూపాయాలు ఇవ్వాలని మోదీని ఆర్థిక మద్దతు కోరినట్లు ఆమె పేర్కొన్నారు. బ్లూమ్‌బర్గ్ నుంచి సోర్స్ అందినట్లు ఆమె తెలిపారు.
జర్నలిస్ట్ మనేకా ట్వీట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. ప్రాంతీయ పార్టీలను గెలిపించుకుంటే ఢిల్లీలో ఎలా చక్రం తిప్పొచ్చో.. ఈ అంశం ద్వారా తెలుస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు వీటన్నింటిని నిశితంగా గమనిస్తున్నారని ఆశిస్తున్నానని కేటీఆర్ తెలిపారు. స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని కేటీఆర్ స్పష్టం చేశారు.
**ఇక తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు.. తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం పోరాటం చేయడం లేదు. లోక్‌సభ ఎన్నికలు అయిపోగానే తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణిని బీజేపీ ప్రభుత్వం వేలం వేసింది. ఇందుకు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సహకరించింది. ఇక రేవంత్ సర్కార్.. 400 ఎకరాల ప్రభుత్వ భూములను తనాఖా పెట్టేందుకు సిద్ధమైనట్లు వార్తా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. 20 వేల కోట్ల విలువైన ఈ భూములను తనాఖా పెట్టి రూ. 10 వేల కోట్లు సమీకరించేందుకు రేవంత్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏపీలో చంద్రబాబు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. తెలంగాణలో మాత్రం ఉన్న ప్రభుత్వ భూములను తనాఖా పెట్టేందుకు సిద్ధమయ్యారు రేవంత్.