Monday, December 30, 2024
HomeTelanganaకర్ణాటక వాల్మీకి స్కామ్ లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలెవరు?

కర్ణాటక వాల్మీకి స్కామ్ లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలెవరు?

జనపదం సోమవారం -27-08-2024 E-Paper

పత్రికా ప్రకటన

కర్ణాటక వాల్మీకి స్కామ్ లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలెవరు?

కర్ణాటక నుంచి అక్రమంగా తెలంగాణలోని ఏ అకౌంట్లకు డబ్బులు వచ్చాయి

రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు ఈ వార్తలు బయటకురాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు

సిద్దిరామయ్యను తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వం కూలుతుందని కర్ణాటక మంత్రి మట్లాడటంలో ఆంతర్యమేమిటీ?

తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద దర్యాప్తు జరగకుండా రక్షిస్తున్నదెవరు?

తమ సొంత పార్టీ అవినీతి పైన రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్

కర్ణాటకలో వాల్మీకి స్కామ్ తీగ లాగితే డొంకంతా తెలంగాణ కాంగ్రెస్ నేతల వైపు కదులుతోందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో తెలంగాణలోని కీలకమైన కాంగ్రెస్ నేతల హస్తం ఉన్నట్లు ఆధారాలు లభిస్తున్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆయన ప్రశ్నించారు. వాల్మీకిి స్కామ్ లో భారీగా అవినీతి జరిగిందంటూ స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యనే అసెంబ్లీలో అంగీకరించటంతో ఈ మొత్తం స్కాంలో ఉన్నఅందరినీ పేర్లు బయటకు రావాల్సిన అవసరముందన్నారు. బీఆర్ఎస్ పార్టీ యూట్యూబ్ ఛానెల్ వేదికగా కేటీఆర్ ఈ అంశంపై పలు ప్రశ్నలను సంధించారు. సరిగ్గా పార్లమెంట్ ఎన్నికలకు ముందు దాదాపు రూ. 180 కోట్లు ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ అకౌంట్ల నుంచి ఏ కారణం లేకుండా అక్రమంగా దారి మళ్లిందన్నారు. “ఈ సొమ్ము అంతా ఎవరికీ ఖాతాలోకి బదిలీ అయిందో ప్రజలకు తెలియాలి. అందులో రూ. 45 కోట్లు హైదరాబాద్ లోని 9 బ్యాంకు ఖతాలకు బదిలీ చేశారు? ఆ బ్యాంక్ ఖాతాలు ఎవరివో తేల్చాలి” అని కేటీఆర్ కోరారు. ఈ వ్యవహారం బయటకు రాగానే వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్స్ సూపరిండెంట్ సూసైడ్ చేసుకోవటం మరింత అనుమానాలకు తావిస్తోందన్నారు. V6 పేరుతో ఉన్నబిజినెస్ సంస్థ కు రూ. 4.5 కోట్లు బదిలీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు ఆ సంస్థ యాజమాని ఎవరో ప్రజల ముందుంచాలన్నారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ డబ్బే తమ ఎన్నికల కోసం వాడినట్లుందని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు.

వాల్మీకి స్కామ్ వ్యవహారంలో హైదరాబాద్ లో SIT, CID, ED లు దాడులు నిర్వహించినప్పటికీ ఆ సమాచారం మీడియాలో రాకుండా అడ్డుకున్నదెవరని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సహా కీలకమైన కాంగ్రెస్ నేతలు కొంతమంది మీడియాను మేనేజ్ చేసినప్పటికీ మరో నాలుగైదురోజుల్లో అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని బార్లు, బంగారు దుకాణాల నుంచి భారీగా నగదు విత్‌ డ్రా చేసినట్లు సమాచారం ఉంది. ఆ బార్లు, బంగారం దుకాణాలను నడుపుతున్నెదవరు? వారికి కాంగ్రెస్ పార్టీతో ఉన్న సంబంధం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు.

కర్ణాటక సీఎం సిద్దిరామయ్యను తొలగిస్తే…తెలంగాణ ప్రభుత్వం కూడా కూలిపోతుందని కర్ణాటక మంత్రి సతీష్ జారకిహోళి అనటం వెనుక అంతర్యం ఏమిటనీ కేటీఆర్ నిలదీశారు. అంటే కర్ణాటక కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య పెనవేసుకున్న బంధం ఈ వాల్మీకి స్కామేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ స్కామ్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలున్నట్లు పెద్ద ఎత్తున ఆధారాలు కనబడుతున్నప్పటికీ ED ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక్కడి నేతలు కాపాడుతున్న శక్తులెవరో ప్రజల ముందుంచాలన్నారు. పార్లమెంట్ లో అవినీతి పై పెద్ద ఎత్తున మాట్లాడే రాహుల్ గాంధీ…ఈ వాల్మీకి స్కామ్ లో ఎందుకు మౌనంగా ఉన్నారని కేటీఆర్ మండిపడ్డారు. అంటే సొంత పార్టీ నేతలు అవినీతి చేస్తే మాఫీయేనా అని విమర్శించారు. వెంటనే రాహుల్ గాంధీ ఈ విషయంపై స్పందించాలని మొత్తం వ్యవహారంలో ఉన్న పెద్ద చేపల పేర్లు బయటకు రావాల్సిన అవసరముందన్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు