Sunday, December 29, 2024
HomeNationalKTR: రాహుల్ సన్నాసా.. రేవంత్ సన్నాసా: కెటిఅర్

KTR: రాహుల్ సన్నాసా.. రేవంత్ సన్నాసా: కెటిఅర్

  • విద్యార్ధులను అధికారం కోసం వాడుకున్న రాహుల్ గాందీ సన్నాసా.. లేక రేవంత్ రెడ్డి సన్నాసా చెప్పాలి-కెటిఅర్
  • విద్యార్థులను, నిరుద్యోగులను అవమానపరిచేలా మాట్లాడిన రేవంత్ వారికి క్షమాపణ చెప్పాలి
  • రేవంత్ రెడ్డిపైన నిప్పులు చెరిగిన కెటిఅర్
  • మెగా డియస్సీ అని చెప్పి కేవలం 6వేల అదనపు పోస్టులతో విద్యార్ధులకు, నిరుద్యోగులకు దగా చేస్తున్నాడు
  • నేడు విద్యార్ధులపై దాడులు చేస్తున్న పోలీసుల పేర్లు డైయిరీలో నమోదు చేస్తున్నారు..అధికారంలోకి వచ్చినాక వదిలిపెట్టం
  • ప్రజలపై దాడులు చేయడమే ప్రజాపాలనా అని ప్రశ్న
  • బిఆర్ఎస్వి విద్యార్థి నాయకుల సమావేశంలో కేటీఆర్ కామెంట్స్
  • సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా భరించలేని నిరంకుశ మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • తమ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులపైన పోలీసు దాడులు చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు
  • రాహుల్ గాంధీతో సహా నిరుద్యోగులను ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ వాడుకుంది
  • జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి దినపత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు కూడా ఇచ్చారు
  • రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన కాంగ్రెస్ హామీని… నిరుద్యోగులు విద్యార్థులు అడుగుతున్నారు
  • నిరుద్యోగులందరికీ యువకులకు రాజకీయాలను రేవంత్ అంటగడుతున్నాడు
  • ఆరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో సహా అనేక మందిని విద్యార్థులు కలిశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మాతోపాటు, ఇతర పార్టీ నాయకులను కలుస్తున్నారు
  • ఉద్యోగాలను.. నోటిఫికేషన్లను అడిగితే వారిని అవమానపరిచేలా అడ్డగోలుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు
  • మరి విద్యార్ధుల చుట్టు చేరి వారిని ఎన్నికల కోసం వాడుకున్న రేవంత్ రెడ్డి సన్నాసా.. లేక అప్పుడు వారిని కలిసిన రాహుల్ గాందీ సన్నాసా రేవంత్ చెప్పాలి
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి.. తలలు పగలగొట్టడం.. వీపులు పగలగొట్టడమే ప్రజల పాలనా అని ప్రశ్న
  • పాత అరాచకాల కాంగ్రెస్… మోసపూరితంగా కొత్త రూపంలో వచ్చిందని ప్రజలు ఆరు నెలల్లోనే అర్థం చేసుకుంటున్నారు
  • ఇచ్చిన హామీలు పక్కకు వదిలేసి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను కూడా రద్దు చేస్తున్నారు
  • ఇదేమి అన్యాయమని అడిగిన వాళ్లందరిపైన కేసులు నమోదు చేస్తున్నాను
  • అధికారంలో లేనప్పుడు ప్రవేట్ విశ్వవిద్యాలయాలు వద్దన్న కాంగ్రెస్ పార్టీ… అధికారంలోకి రాగానే 7 కొత్త వాటికి అనుమతులు ఇచ్చింది…
  • ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 50 వేల ఉద్యోగాలతోని మెగా డీఎస్సీ విడుదల చేయాలని రేవంత్ రెడ్డి మాట్లాడిండు, కానీ ఈనాడు మోగా డియస్సీ మాట మర్చిపోయిండు
  • కానీ ఇప్పుడు కేవలం సూమారు 6000 ఉద్యోగాల అదనంగా ఇచ్చి డీఎస్సీ పేరుతో యువకులను మోసం చేస్తుండు
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ యువకుడు తెలంగాణ కథానాయకుడిగా నిలబడిపోతారు
  • ఈరోజు విద్యార్థులపై దాడులతో చేస్తున్న గాయాలు మానిపోయినా, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని మాత్రం మర్చిపోరు
  • తెలంగాణ పోలీసులు అధికారులు విద్యార్థుల పైన చేస్తున్న దాడులను విద్యార్థి నాయకులు తమ డైరీలో నమోదు చేసుకుంటున్నారు
  • విద్యార్థులపైన ప్రజల పైన దాడులు చేస్తున్న పోలీస్ అధికారులను, మేము తిరిగే అధికారంలోకి వచ్చినంక వదిలిపెట్టం
  • పదేళ్ల మన ప్రభుత్వ హయాంలో లక్ష అరవై రెండు వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాము.. మరో 40,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతూ ఉండే , అందులోంచి 30 వేల ఉద్యోగాల నియామక పత్రాలను రేవంత్ రెడ్డి ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు
  • విద్యార్థుల ఉద్యోగాల కోసం 95% స్థానిక రిజర్వేషన్లు కల్పించాం
  • పార్టీ విద్యార్థి విభాగం నుంచి అనేకమంది నాయకులను, ప్రజాప్రతినిధులుగా, చైర్మన్లుగా, మేయర్లుగా, జిల్లా స్థాయి అధ్యక్షులుగా అనేకమందిని పార్టీ తయారు చేసుకోగలిగింది
  • అధికారంలో ఉన్నప్పటి కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే విద్యార్థి నాయకుల పాత్ర కీలకమవుతుంది
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడగలిగే అవకాశం కలుగుతుంది
  • ప్రభుత్వ అన్యాయాలను అక్రమాలను ఎండగట్టవచ్చు
  • రాజకీయ నాయకులుగా ఎదిగేందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ అవకాశం ఉంటుంది
  • నిజాయితీపరులు, దమ్మున్న నాయకులు వందలు, వేలమంది ఈ పార్టీకి ఆస్తిగా ఉన్నారు
  • 2009 నుంచి 2014 దాకా తెలంగాణ కోసం విద్యార్థులు చేసిన గొప్ప ఉద్యమ స్ఫూర్తిని పోరాటాలను ఇప్పటి విద్యార్థులకు చెప్పేలా చేయాలి
  • విద్యారంగంలో జరిగే ప్రతి అన్యాయం దగ్గర విద్యార్ధి విభాగం అందోళన ఉండాలి
  • రాష్ట్ర యువత పైన పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టిన కేటీఆర్

X ఎక్స్ వేదికగా డిజిపికి పలు సూచనలు

  • గత కొన్నేళ్లుగా తెలంగాణ పోలీసులు తమ వృత్తి పట్ల వ్యవహరించే ప్రొఫెషనలిజం తీరుకు మంచి పేరు ఉండే అది పోకుండా వెంటనే కాపాడుకోవాలని సూచన…
  • అత్యుత్సాహం ప్రదర్శిస్తూ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసులను అదుపు చేయాలని సూచన
  • ప్రభుత్వ పెద్దలను సంతృప్తి పరిచేందుకు కొంతమంది వ్యవహరిస్తున్న తీరు పోలీసుల పేరును పూర్తిగా చెడగొడుతుంది
  • చట్ట వ్యతిరేకంగా వ్యవహరించకుండా పోలీసులు సమయమనం పాటించాలని కేటీఆర్ సూచన
  • రాష్ట్రంలో యువత లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పైన ఆవేదన..
  • సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తే కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారన్న కేటీఆర్…
  • తొర్రూరు నియోజకవర్గంలో మాలోతు సురేష్ బాబు అని గిరిజన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని క్రూరంగా హింసించారు.
  • స్థానిక శాసన సభ్యురాలికి వ్యతిరేకంగా వాట్సాప్ లో పోస్ట్ చేయడమే ఆయన చేసిన నేరమా
  • సామాజిక మధ్యమలలో వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా brs శ్రేణులపైన పోలీసులు వ్యవహరిస్తున్న తీరుని తప్పు పట్టిన కేటీఆర్
RELATED ARTICLES

తాజా వార్తలు