Monday, December 30, 2024
HomeTelanganaKTR | కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇవే.. రేవంత్ స‌ర్కార్‌పై కేటీఆర్ సెటైర్లు

KTR | కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇవే.. రేవంత్ స‌ర్కార్‌పై కేటీఆర్ సెటైర్లు

KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అంటే.. ఇన్వ‌ర్ట‌ర్, జ‌న‌రేట‌ర్, క్యాండిల్ లైట్, టార్చ్ లైట్, ప‌వ‌ర్ బ్యాంక్, చార్జింగ్ బ‌ల్బ్ అని కేటీఆర్ ఎద్దెవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వ‌ర‌కు ఈ రాష్ట్రంలో క‌రెంట్ కోత‌లు ఉంటాయ‌న్నారు కేటీఆర్. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్‌లో నిర్వహించిన యూత్ మీటింగ్‌లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న స‌వ‌తి త‌ల్లిపై పోరాటం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఢిల్లీకి గులామ్‌లు అయినా కాంగ్రెస్, బీజేపీతో రాష్ట్రానికి నాలుగు ప్రాజెక్టులు కూడా రావ‌ని చెప్పారు. కేవ‌లం బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే పార్ల‌మెంట్‌లో మ‌న గొంతు విన‌బ‌డుతుంద‌ని, మ‌న హ‌క్కుల‌ను కాపాడుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేశారు.

కాంగ్రెస్ , బీజేపీ ఎంపీలు.. రాహుల్ గాంధీ, మోదీ చెప్పింది చేస్తారు. తెలంగాణ‌ గురించి ద‌మ్మున్న బీఆర్ఎస్‌ నాయ‌కులే కొట్లాడుతారు. జూన్ 2వ తేదీ త‌ర్వాత కేంద్ర ప్ర‌భుత్వం హైద‌రాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసి త‌న గుప్పిట్లో పెట్టుకోవాల‌ని ఆలోచ‌న చేస్తున్న‌ది. కేంద్ర పాలిత ప్రాంతం అయితే.. హైద‌రాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది. ఒక్క చిన్న ప‌ని కూడా చేసుకునేందుకు అవ‌కాశం ఉండ‌దు. మోరీ, నాలా నిర్మించాల‌న్నా, రోడ్డు వేయాల‌న్నా ఢిల్లీకి పోయి అడ‌గాలి. కేంద్ర పాలిత ప్రాంతం ప్ర‌తిపాద‌న‌ను అడ్డుకోవాలంటే గులాంబీ జెండా పార్ల‌మెంట్‌లో ఎగ‌రాలి. రాగిడి ల‌క్ష్మారెడ్డి గెల‌వాల‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ‌లో కేసీఆర్‌తో బీజేపీ ఆట‌లు సాగ‌లేదు.. సాగ‌వు కూడా అని కేటీఆర్ తేల్చిచెప్పారు. ప్రాంతీయ శ‌క్తులు బ‌లంగా ఉండ‌డం వ‌ల్ల ఢిల్లీ, ప‌శ్చిమ బెంగాల్, త‌మిళ‌నాడు, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో మోదీ ఆట‌లు సాగ‌లేద‌ని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ, అగ్ర‌వ‌ర్ణాల్లో ఉండే పేద‌ల రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేయాల‌నే ఆలోచ‌న‌లో బీజేపీ ప్ర‌భుత్వం ఉంది. అవ‌స‌ర‌మైతే రాజ్యాంగాన్ని తీసిపాడేయాల‌ని ఆలోచిస్తున్నారు. రిజ‌ర్వేష‌న్లు ఉండాలంటే బీఆర్ఎస్ గెల‌వాలి. ప్రాంతీయ శ‌క్తులు బ‌లంగా ఉండ‌డం వ‌ల్లే మోదీ ఏం చేయ‌లేక‌పోయారు. మోదీతో కొట్లాడే ద‌మ్ము రాహుల్ గాంధీకి లేదు అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ స్థానానికి పోటీ చేస్తున్న ఈట‌ల రాజేంద‌ర్, సునీతా మ‌హేంద‌ర్ రెడ్డి ఇద్ద‌రూ పొలిటిక‌ల్ టూరిస్టులు అని, మే 13 త‌ర్వాత మ‌ళ్లీ వారు క‌న‌బ‌డ‌రు అని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్య‌ర్థి రాగిడి ల‌క్ష్మారెడ్డి మాత్రం లోకల్. ఉప్ప‌ల్‌లోనే ఉంటాడు. మీ మ‌ధ్య‌లోనే ఉండే వ్య‌క్తి. కాబ‌ట్టి రాగిడి ల‌క్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కేటీఆర్ కోరారు.

RELATED ARTICLES

తాజా వార్తలు