Friday, April 4, 2025
HomeAndhra PradeshKTR | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రోసారి జ‌గ‌నే ముఖ్య‌మంత్రి: కేటీఆర్‌

KTR | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రోసారి జ‌గ‌నే ముఖ్య‌మంత్రి: కేటీఆర్‌

హైద‌రాబాద్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తుంద‌ని, సీఎం జ‌గ‌న్ మంచి ఫ‌లితాలు సాధిస్తార‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఏపీలో త‌న‌కు చాలామంది మిత్రులు ఉన్నార‌ని చెప్పారు. సీఎం జ‌న‌గ్ త‌న సోద‌రుడిలాంటివార‌ని తెలిపారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో భాగంగా ఆయ‌న త‌న స‌తీమ‌ణితో క‌లిసి హైద‌రాబాద్‌లోని నందిన‌గ‌ర్‌లో త‌న ఓటుహ‌క్కు వినియోగించుకున్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ‌లో 2019 ఎన్నిక‌ల్లో సాధించిన సీట్ల‌క‌న్నా ఎక్కువ గెలుస్తామ‌నే న‌మ్మ‌కం ఉంద‌న్నారు. గ‌తంలో ఇంత‌కంటే అనేక స‌వాళ్ల‌తో కూడిన ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ విజ‌యం సాధించింద‌ని గుర్తుచేశారు. ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ప్ర‌తిపార్టీ తామే గెలుస్తామంటుంది. కానీ ప్ర‌జ‌లు దానిని నిర్ణ‌యిస్తార‌ని చెప్పారు.

పోలింగ్ స్టేష‌న్ల వ‌ద్ద క‌రెంటు కోత‌లు లేకుండా జ‌న‌రేట‌ర్లు పెట్టి ముగ్గురు ముగ్గురు అధికారుల‌తో ప్ర‌భుత్వం క‌ష్ట‌ప‌డుతున్న‌ద‌ని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీల్లో తెలంగాణ ప్ర‌భుత్వం ఒక‌ గ్యారంటీని స‌గం స‌గం అమ‌లు చేసింద‌ని విమ‌ర్శించారు. సీఎం రేవంత్ ఇప్ప‌టికైనా తాను ముఖ్య‌మంత్రిన‌ని గుర్తించాల‌ని, ప్ర‌భుత్వ ప‌నితీరుపై దృష్టి సారించాల‌ని హిత‌వుప‌లికారు. తెలంగాణ తెచ్చిన నాయ‌కుడు, తెలంగాణ తెచ్చిన పార్టీకి నాయ‌కుడు కేసీఆర్ అని.. తెలంగాణ కోసం, తెలంగాణ భ‌విష్య‌త్ కోసం తాను ఓటు వేశాన‌ని చెప్పారు.

RELATED ARTICLES

తాజా వార్తలు