బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తిని తన ఎస్కార్ట్ కారులో ఆస్పత్రికి పంపించారు. ఈ ఘటన వరంగల్ లేబర్ కాలనీ వద్ద బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
వరంగల్ లేబర్ కాలనీ వద్ద ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అదే దారిలో కేటీఆర్ నర్సంపేట పర్యటనకు వెళ్తున్నారు. గాయాల పాలైన వ్యక్తిని గమనించిన కేటీఆర్.. తక్షణమే తన కారును ఆపించారు. కారు దిగిన కేటీఆర్.. రోడ్డు ప్రమాద బాధితుడిని పరిశీలించారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడని, వరంగల్ ఎంజీఎంకు తరలించాలని తన సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు. ఇక ఎస్కార్ట్ వాహనంలో బాధిత వ్యక్తిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
మానవత్వం చాటుకున్న కేటీఆర్.. ఆక్సిడెంట్‌కు గురైన వ్యక్తిని తన ఎస్కార్ట్ కారులో ఆస్పత్రికి తరలించిన కేటీఆర్
వరంగల్ లేబర్ కాలనీ వద్ద అంజయ్య (55) అనే వ్యక్తి ఆక్సిడెంట్‌కు గురై రోడ్డుపై కిందపడి ఉన్నాడు.. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచార నిమిత్తం అటుగా వెళ్తున్న కేటీఆర్ అతన్ని చూసి తన… pic.twitter.com/WLfrKKpJRp
— Telugu Scribe (@TeluguScribe) May 22, 2024