Wednesday, April 2, 2025
HomeCinemaKuldeep Yadav: బాలీవుడ్‌ నటితో కుల్‌దీప్‌ యాదవ్‌ పెళ్లి?

Kuldeep Yadav: బాలీవుడ్‌ నటితో కుల్‌దీప్‌ యాదవ్‌ పెళ్లి?

టీ20 ప్రపంచ కప్‌ టీమ్‌లో ఒకరైన కుల్‌దీప్‌ యాదవ్‌కు సొంత గడ్డ కాన్పూర్‌లో ఘన స్వాగతం లభించింది. అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి టపాసులు, డోలు చప్పుళ్ల మధ్య ఊరేగిస్తూ తీసుకెళ్లారు. కుల్‌దీప్‌ తన వ్యక్తిగత జీవితం గురించి ఒక విషయం వెల్లడించాడు.
తాను త్వరలో వివాహం చేసుకోబోతున్నానంటూ అభిమానులకు కుల్‌దీప్‌ తీపి కబురు చెప్పాడు. అయితే, గత కొంత కాలంగా ఓ బాలీవుడ్‌ నటితో అతడు స్నేహం కొనసాగిస్తున్నట్లు రూమర్స్‌ వస్తున్న విషయాన్ని కొట్టిపారేశాడు. తాను పెళ్లి చేసుకోబోయేది సినిమా రంగానికి చెందిన వ్యక్తిని కాదని కుండబద్దలు కొట్టాడు. తనను, కుటుంబాన్ని బాగా చూసుకునే అమ్మాయి తన జీవితంలోకి రావడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. దీనిపై త్వరలోనే అందరికీ శుభవార్త చెబుతానని ఒక ఛానెల్‌తో మాట్లాడుతూ కుల్‌దీప్ అన్నాడు.
మరోవైపు వరల్డ్‌ కప్‌ గెలవడంపై కుల్‌దీప్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ క్షణాల కోసం చాలా కాలం నుంచి వేచి చూసినట్లు తెలిపాడు. వ్యక్తిగతం కంటే కూడా టీమ్‌గా ఈ కప్‌ భారత్‌కు చాలా అవసరమని పేర్కొన్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం చాలా ఉత్సాహం నింపిందని తెలిపాడు. టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీలో 10 వికెట్లు తీసిన కుల్‌దీప్.. టీమ్‌ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

RELATED ARTICLES

తాజా వార్తలు