Wednesday, January 1, 2025
HomeHealthKurilo | ఈ మొక్కతో రొమ్ము క్యాన్సర్‌కు చెక్‌..! పరిశోధనల్లో వెల్లడి..!

Kurilo | ఈ మొక్కతో రొమ్ము క్యాన్సర్‌కు చెక్‌..! పరిశోధనల్లో వెల్లడి..!

Kurilo | ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రభావితం చేస్తున్న క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్‌ ఒకటి. అయితే, భారతీయ పరిశోధకులు కీలక పరిశోధన చేపట్టారు. హిమాలయాల్లో దొరికే ఓ మొక్క సహాయంతో ఈ క్యాన్సర్‌కు చెక్‌పెట్టవచ్చని పేర్కొంటున్నారు. దీంట్లో క్యాన్సర్‌ను నిర్మూలించే గుణాలున్నాయని గుర్తించారు. హిమాలయ పర్వత సానువుల్లో దొరికే ఆస్పరాగస్‌ రేమోసిస్‌ మొక్క రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళలకు ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. మొక్కను కురిలో అని కూడా పిలుస్తుంటారు. పరిశోధకులు ప్రయోగశాలలో కురిలో కాకుండా అశ్వగంధ, కీమోథెరపీలో ఉపయోగించే మందుల మిశ్రమాన్ని తీసుకొని రొమ్ము క్యాన్సర్‌ మూలకణాలపై ప్రయోగించారు.

మూల కణాలు తక్కువ సమయంల నాశనం కావడం ప్రారంభమైంది. రొమ్ము క్యాన్సర్‌ చికిత్సలో ఈ అధ్యయనం కొత్త ఆశాజనకంగా కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. ఈ మేరకు అధ్యయనం వివరాలను మంత్రిత్వ శాఖ వివరించింది. మెడికల్ జర్నల్ ఎల్సెవియర్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనాన్ని మణిపాల్ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించారు. ఆస్పరాగస్ రేసిమోసస్ మొక్క భారతదేశంలోని హిమాలయాల్లో కనిపిస్తుందని. అయితే, ఇది అంతరించిపోయే ప్రమాదం ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మొక్కను రక్తం, మూత్రపిండాలు, కాలేయం, ఆర్థరైటిస్‌, గాయిటర్‌, గోనేరియా తదితర వ్యాధుల్లో చికిత్సకు ఉపయోగిస్తున్నారు.

ఒక రోగికి అశ్వగంధతో పాటు శాతవారి రేసిమోసస్ అంటే కురిల్లో ప్లాంట్, కీమో థెరప్యూటిక్ డ్రగ్ పాక్లిటాక్సెల్ (PTX)తో చికిత్స చేస్తే.. కణితి పెరుగుదలను నిరోధింవచ్చని చెప్పారు. ప్రయోగశాలలో ఎలుకలపై ఈ అధ్యయనం జరిగిందని.. రోగులపై క్లినికల్ ట్రయల్స్‌లో దీన్ని చేర్చాలని పరిశోధకులు సిఫారసు చేశారు. ఔషధంతో పాటుగా మొక్కల సారాలను సిద్ధం చేసి, పరీక్షించారు. అధ్యయనం సమయంలో మొక్కల నుంచి సారాలను తీసుకొని కీమో థెరప్యూటిక్ డ్రగ్‌తో కలిపినప్పుడు.. ఎంసీఎఫ్‌-7 కణాలలో రెండింటినీ కలపడం వల్ల మామోస్పియర్, సీడీ ఏర్పడేందుకు దారి తీసిందని పరిశోధకులు తెలిపారు.

44/సీడీ24 సీఎస్‌సీ గుర్తులు సైతం తగ్గడం ప్రారంభించాయని.. పాక్లిటాక్సెల్ (PTX) మాత్రమే ఇవ్వడం కంటే ఔషధ మొక్కలతో చికిత్స మెరుగైన ఫలితాలున్నాయని అధ్యయనం చూపించింది. విట్రో, ఎలుకలపై జరిపిన పరీక్షలలో ఈ విషయం తేలింది. ఇదిలా ఉండగా.. దేశంలో ఏటా రెండులక్షల రొమ్యు క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయి. వాస్తవానికి, ఐసీఎంఆర్‌ నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ (NCRP) ప్రకారం.. భారతదేశంలో ప్రతి సంవత్సరం రెండు లక్షల కంటే ఎక్కువ రొమ్ము క్యాన్సర్ కేసులు రికార్డవుతున్నాయి. దేశంలోని 22 మంది మహిళల్లో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. భారతదేశంలో 2022లో 14,13,316 కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి.

RELATED ARTICLES

తాజా వార్తలు