Latest survey| నెంబర్ గేమ్ అనేది ఎప్పుడు ఆసక్తికరంగా ఉంటుంది. ఏ హీరో టాప్ పొజీషన్‌లో ఉన్నాడు, ఎవరికి ఎక్కువ ఆదరణ ఉందని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే సాధారణంగా స్టార్‌డం అనేది అతని మార్కెట్ ఎలా ఉంది, ఫ్యాన్ బేస్ ఏ విధంగా ఉందనే దానిని బట్టి నిర్ణయించబడుతుంది. అయితే టాలీవుడ్ హీరోలలో ఎవరు టాలీవుడ్ నెంబర్ వన్‌గా ఉన్నారు అనే దాని గురించి ప్రముఖ మీడియా సంస్థ ఏప్రిల్ 24 వరకు సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. పదో ర్యాంక్ నుండి చూస్తే విజయ్ దేవరకొండ ఈ స్థానంలో ఉన్నారు. మంచి క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండకి వరుస ఫ్లాపులు మైనస్ అయ్యాయి.
ఇక మెగాస్టార్ చిరంజీవి 9వ స్థానంలో ఉన్నారు. కుర్రాళ్లకి పోటీ ఇస్తున్న చిరు టాప్ 9లో ఉండడం గొప్ప విషయమే. ఆయనకి ఈ మధ్య కాలంలో మంచి హిట్ పడలేదు. ఒక్క హిట్ వచ్చిన చిరు ర్యాంక్ టాప్5లోకి తప్పక వెళుతుంది. ఇక మాస్ మహరాజ్ రవితేజ్ ఒక్క పాన్ ఇండియా సినిమా చేయకపోయిన అతనికి ఇండియా మొత్తంగా ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం ఎనిమిదో ర్యాంకులో ఆయన కొనసాగుతున్నారు. ఇక నేచురల్ స్టార్ నాని 7వ స్థానంలో ఉన్నారు. టైర్ 2 హీరోల్లో నానినే నెంబర్ వన్ కాగా, మొత్తంగా 7వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన ఇప్పుడు రాజకీయాలతో బిజీగా ఉండడం వలన 6వ ర్యాంకులో ఉన్నారు.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ టాప్ 5లో ఉన్నారు. గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత ఆయన ర్యాంక్ పెరిగే అవకాశం ఉంది. ఇక అల్లు అర్జున్ టాప్ 4లో ఉన్నారు. పుష్పతో అంత పెద్ద హిట్ కొట్టిన కూడా ఆయన ఈ ర్యాంకులో ఉండడం ఆసక్తికరంగా మారింది. ఇక జూనియర్ ఎన్టీఆర్‌కి 3వ స్థానం దక్కింది. ఆయన త్వరలో దేవర, వార్2 చిత్రాలతో పలకరించనున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఆడియన్స్ 2వ ర్యాంక్ కట్టబెట్టారు. త్వరలో మహేష్ బాబు .. రాజమౌళితో కలిసి బడా ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఇక టాలీవుడ్ నుండి తొలి పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌కి ఒకటో ర్యాంక్ ఇచ్చారు. బాహుబలి తర్వాత వరుస ఫ్లాపులు వచ్చిన కూడా సలార్‌తో పెద్ద హిట్ కొట్టాడు ప్రభాస్.