Sunday, December 29, 2024
HomeTelanganaఅస్మదీయ అధ్యక్షుడు కావలెను..

అస్మదీయ అధ్యక్షుడు కావలెను..

Click to view

JanaPadham-11-08-2024 E-Paper

JanaPadham-10-08-2024 E-Paper

అస్మదీయ అధ్యక్షుడు కావలెను..

రెండు జాతీయ పార్టీల అన్వేషణ
ఇరుపార్టీల్లో రెడ్డి సామాజిక వర్గం డామినేషన్..
చెప్పు చేతల్లో ఉండే బీసి నేతలెవరు..
సామాజిక వర్గాలుగా సమీకరణాలు..
అనుయాయుల కోసం రాష్ట్రపార్టీ పెద్దల తాపత్రయం..
తీవ్ర ప్రయత్నాల్లో ఆశావహులు..
దసరాకైనా కొలిక్కి వచ్చేనా అనే అనుమానాలు..

======
(పెద్దగా…)

రెండు జాతీయ పార్టీలు. అక్కడ అధికారంలో ఆ పార్టీ.., ఇక్కడ మరో పార్టీ. రెంటికి రెండు పార్టీ రాష్ట్ర అధ్యక్షుల కోసం తీవ్ర కసరత్తు. చట్ట సభల ఎన్నికలు ముగిశాయి. పాలన పనిలో నేతలు బిజీగా మారారు. ఇక మిగిలింది స్థానిక సమరం. ఇప్పటికైనా తమ బాధ్యతలను వేరే వారికి అప్పగించి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వారివారి కార్యకలాపాలను చేసుకునే వెసులుబాటు కోసం యత్నిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా పదవుల అప్పగించే యత్నంలో ఎవరికి వారుగా సామాజిక సమీకరణాలపై కూడా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. రెండు పార్టీల్లో చెప్పు చేతుల్లో ఉండే బీసీ నేత వెతుకుతున్నారు.

===========================

జనపదం, హైదరాబాద్ బ్యూరో

పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటి నుండి బీజేపి, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్ష పదవులను భర్తీ చేసేందుకు తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తున్నాయి. సామాజికవర్గాల సమీకరణాల నేపధ్యంలో రెండు పార్టీలకూ బీసీ నేతలే కావాలని జాతీయ స్థాయిలో పట్టుపడుతున్నా స్థానికంగా అసలు సిసలు అభ్యర్థులెవ్వరన్న చర్చ రెండు పార్టీలో విస్తృతంగా సాగుతున్నది. తెలంగాణ అంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సామూహం. కాని రెండు జాతీయ పార్టీలో పై స్థాయిలో రెడ్డి సామాజికవర్గ నేతలే ఉన్నారు. బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో బీసీ లీడర్ల కోసం అన్వేషణ సాగిస్తున్నా ఒక దశలో ఎంపిక దాదాపుగా పూర్తయినా తమ అస్మదీయులు కావాలని ఆయా పార్టీలో చక్రం తిప్పుతున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డికి చేదోడు వాదోడుగా ఉండే నేత కావాలని ప్రయత్నిస్తున్నారు. అందుకు బీసీ, ఎస్టీ ల నుండి ఒకరిద్దరు తన అస్మదీయుల పేర్లు కూడా అదిష్టానానికిచ్చాని తెలుస్తోంది. ఇక బీజేపి నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎవరు అనుకూలంగా ఉంటే బాగుంటుదని చర్చ జరిగినా ఒక దశలో బీసీ అధ్యక్షుడు పేరు దాదాపు ఖరారైనా కొత్త వారికెలా ఇస్తరు…సంఘ్ అభ్యంతరాలను అదగిమించడం ఎలా చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డికి పంటికింద రాయిలా కాకుండా కంటికింది ఉండేవారినే రెండు జాతీయ పార్టీలు నియమించుకోవాలని చూస్తున్నాయి.

కాంగ్రెస్ లో అస్మదీయుడికే అవకాశం
పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కొత్త పీసీసీ చీఫ్ కోసం వేట ఆరంభించింది. సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండే వారి కోసం వడబోత మొదలు పెట్టింది. పార్టీ అధికారంలోకి రాగానే కొత్త పీసీసీ చీఫ్ కోసం మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు. బీసీ కోణంలో మధు యాష్కి పేరును అధిష్టానం ఖరారు చేసే క్రమంలో అదే గౌడ సామాజికవర్గం నుంచి మహేశ్ గౌడ్ పేరును సీఎం రేవంత్ తెరపైకి తీసుకొచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ మహేశ్ గౌడ్ కాకపోతే ఎస్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ బలరాం నాయక్ కు ఇవ్వాలని సీఎం రేవంత్ ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. బీసీ అయినా ఎస్టీ అయినా కూడా సీఎం రేవంత్ కనుసన్నులో ఉండే పీసీసీ చీఫ్ కావాలని రేవంత్ పట్టుబడుతున్నారని ప్రచారం జరుగుతోంది. అధిష్టానం దగ్గర రేవంత్ పలుకుబడి దగ్గరగా చూస్తోన్న కాంగ్రెస్ సీనియర్లు కూడా పోటీ నుండి తప్పుకున్నారనే చెప్పాలి.

బీసీ.. లెఫ్ట్… కానీ సిద్ధాంతం రైట్..
బీజేపి తీరిది..

బీజేపీలో రాష్ట్ర కొత్త అధ్యక్షుడి నియామకం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తొందరగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను తప్పించాలని అధిష్టానానికి ఇప్పటికే విన్నవించారు. గ్రామ, మండల జిల్లా స్థాయిల్లో పార్టీ పటిష్టతతో పాటు స్థానిక ఎన్నికల్లో ప్రజా ప్రతినిధుల ప్రాతినిధ్యం పెంచుకోవడమనేది బీజేపీకి తక్షణ అవసరంగా మారింది. స్థానిక ఎన్నికల్లో జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అంతగా కేడర్, స్థానిక నాయకుల బలం లేని బీజేపీ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ ను ఎదుర్కొని గణనీయమైన సంఖ్యలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ఎలా గెలిపించుకోగలుగుతుందనే చర్చ కూడా పార్టీలో సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత తొందరగా రాష్ట్ర రాజకీయాలపై పట్టున్న నేతను కొత్త అధ్యక్షుడిని నియమిస్తే ఎన్నికల్లోగా సంస్థాగతంగా పార్టీ బలం పెం చుకునేందుకు అవకాశం ఉంటుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు గట్టిగా పోటీ పడుతున్నారు. ఈ పదవి కోసం ఎంపీలు డీకే ఆరుణ, , అర్వింద్ ధర్మపురి, ఈటల రాజేందర్, ఎం.రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, టి.రాజాసింగ్, ముఖ్యనేతలు ఎన్. రామచంద్రరావు, చింతల రామచంద్రా రెడ్డి, టీఆచారి, యెండల లక్ష్మీనారాయణ, ఎం.ధర్మారావు, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, డా. కాసం వెంకటేశ్వర్లు పోటీపడుతున్నారు. బీజేఎల్సీ నేతగా రెడ్డి సామాజికవర్గానికి అవకాశం ఇచ్చినందున, రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ వర్గానికి చెందినవారినే ఆధిష్టానం నియమిస్తుంది. ఎంపీ ఈటల రాజేందర్ పేరును దాదాపు ఖరారు చేసినట్టే చేసి ఆపింది. రెండేళ్ల క్రితమే పార్టీలో చేరిన ఈటలకు అధ్యక్ష పదవి ఎలా ఇస్తారనే ప్రశ్నను కొందరు లేవనెత్తుతున్నారు. అందులో సైద్దాంతికం, సంఘ్ అంశాలను కమలదళం పరిశీలిస్తే ఆయన కష్టమే అంటున్నారు. సైద్ధాంతిక అంశాలకు ప్రాధాన్యతనిస్తే మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావును అధ్యక్షుడిగా ఎంపిక చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు