Monday, January 6, 2025
HomeTelanganaRain Alert | రాష్ట్రంలో వ‌చ్చే మూడు రోజులు వ‌ర్షాలు.. ఈదురు గాలులు కూడా..

Rain Alert | రాష్ట్రంలో వ‌చ్చే మూడు రోజులు వ‌ర్షాలు.. ఈదురు గాలులు కూడా..

హైద‌రాబాద్‌: తెలంగాణ ప్ర‌జ‌ల‌కు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం చ‌ల్ల‌టి క‌బురు (Rain Alert) అందించింది. రాష్ట్రంలో రాగల మూడు రోజులు ప‌లు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆవర్తనం ఒకటి పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఏర్పడిందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. రాష్ట్రంలో పలు జిల్లాలో వచ్చే మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని వెల్లడించింది. దీంతో పాటు రాష్ట్ర ప్రజలకు జాగ్రత్తలు తెలిపింది.

రేపు ఎక్క‌డెక్క‌డ అంటే..

ఆదిలాబాద్, ఆసిఫాబాద్​, మంచిర్యాల, నిర్మల్​, నిజామాబాద్​, భూపాలపల్లి, ములుగు, కొత్త గూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్​, వరంగల్​, హనుమకొండ, జనగామ, సిద్దిపేట​, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్​, మేడ్చల్​ మల్గాజిగిరి, వికారాబాద్​, సంగారెడ్డి, మెదక్​, మహబూబ్​నగర్​, నాగర్​ కర్నూల్, వనపర్తి, నారాయణపేట‌​, గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయ‌ని చెప్పింది. అదేవిధంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయ‌ని తెలిపింది.

గురు, శుక్ర‌వారాల్లో..

ఈ నెల 16న.. ఆదిలాబాద్​, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్​, నిజామాబాద్, జయశంకర్​ భూపాల పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్​, మేడ్చల్​ మల్గాజిగిరి, వికారాబాద్​, సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయ‌ని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయ‌ని చెప్పింది.

ఈ నెల 17న.. ఆదిలాబాద్​, కుమురం భీం, మంచిర్యాల , నిర్మల్​, నిజామాబాద్​, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్​, పెద్దపల్లి, సిద్దిపేట, మేడ్చల్​ మల్గాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్​, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. అదేవిధంగా గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయ‌ని వెల్ల‌డించింది.

RELATED ARTICLES

తాజా వార్తలు