KL Rahul| గత రాత్రి హైదరాబాద్ వర్సెస్ లక్నో మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లక్నో విధించిన టార్గెట్‌ని ఉఫ్ఫుమంటూ ఊదేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఆయుష్ బదోని(30 బంతుల్లో 9 ఫోర్లతో 55), నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 48) మాత్రమే రెండు అంకెల స్కోరు చేశారు. మిగతా వారెవరు కూడా పెద్దగా రాబట్టలేకపోయారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ అయితే జిడ్డు బ్యాటింగ్ చేశాడు. ఆయన చేసిన పరుగుల కన్నా బాల్స్ ఎక్కువ ఉన్నాయి. అయితే లక్నో విధించిన టార్గెట్‌ని 62 బంతులు మిగిలి ఉండగానే చేధించి చరిత్ర సృష్టించింది సన్ రైజన్స్ హైదరాబాద్ జట్టు.
అభిషేక్ శర్మ(28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 నాటౌట్), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో లక్ష్యం చిన్నబోయింది. కేవలం 9.4 ఓవర్లలోనే మ్యాచ్‌ని ఫినిష్ చేశారు. అయితే మ్యాచ్ అనంతరం డగౌట్‌కి వెళుతున్న సమయంలో లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా కేఎల్‌పై ఫైర్ అయ్యారు ..రాహుల్‌పై తీవ్ర స్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేస్తూ కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సంజీవ్ తీరుపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరహా సంభాషణలు అనేవి సీక్రెట్‌గా చేసుకోవాలి తప్ప గ్రౌండ్‌లో ఇన్ని కెమెరాలు ఉన్నచోట ఇలా మాట్లాడుకోవడం ఏంటి, జాతీయ స్థాయి ఆటగాడిని అలా అవమానించడం ఏంటని సంజీవ్ తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు
సంజీవ్ గోయెంకాకు ఆటగాళ్లని మందలించడం ఇదే తొలిసారి కాదు. గతంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కూడా ఆయన అవమానించాడు. 2016 సీజన్‌లో ధోనీ సారథ్యంలోని రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ చెత్త ప్రదర్శన కనబరచింది. పాయింట్స్ టేబుల్‌లో చివరి నుంచి రెండో స్థానంలో నిలవడంతో ఆ సమయంలో ధోనిపై చిర్రుబుర్రులాడాడు. ధోనిని కెప్టెన్సీ నుండి తప్పించి స్మిత్‌కి బాధ్యతలు అప్పగించాడు. ధోని ఫిట్‌నెస్‌పై కూడా సంచలన ఆరోపణలు చేశాడు.
KL Rahul getting another pounding. pic.twitter.com/fBPixOXOJL
— Sumit (@Half_Fri) May 8, 2024