Friday, April 4, 2025
HomeCinemaLok Sabha Elections | ఓటు వేసిన బాల‌కృష్ణ‌, మ‌హేశ్‌, రామ్‌చ‌ర‌ణ్ దంప‌తులు

Lok Sabha Elections | ఓటు వేసిన బాల‌కృష్ణ‌, మ‌హేశ్‌, రామ్‌చ‌ర‌ణ్ దంప‌తులు

హైద‌రాబాద్‌: తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్న‌ది. సాధార‌ణ ప్ర‌జ‌ల‌తోపాటు సినీ రాజ‌య‌కీ ప్ర‌ముఖులు త‌మ ఓటుహ‌క్కు వినియోగించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఉద‌యాన్ని స్టార్ హీరోలు జూనియ‌ర్ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, మెగాస్టార్ చిరంజీవి కుటుంబ స‌మేతంగా ఓటువేశారు. ఇక ప్రిన్స్ మ‌హేశ్ బాబు జూబ్లీహిల్స్ ప‌బ్లిక్ స్కూల్‌లో త‌న స‌తీమ‌ణి న‌మ్ర‌త‌తో క‌లిసి ఓటువేశారు. అంత‌కుముందు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్, ఉపాస‌న దంప‌తులు జూబ్లీక్ల‌బ్‌లో ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఈ సంద‌ర్భంగా చెర్రీ మాట్లాడుతూ.. అంద‌రూ బ‌య‌ట‌కి వ‌చ్చి ఓటేయాల‌ని సూచించారు. ఓటు బ‌రువు కాద‌ని, బాధ్య‌త అని చెప్పారు. ఇండ్ల‌ల్లో ఉన్న యువ‌త బ‌య‌ట‌కు వ‌చ్చి ఓటేయాల‌ని పిలుపునిచ్చారు.

హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లో హీరో నాగ‌చైత‌న్య ఓటువేయ‌గా, సీనియ‌ర్ హీరో, హిందూపురం టీడీపీ అభ్య‌ర్థి నంద‌మూరి బాల‌కృష్ణ త‌న భార్య వ‌సుంద‌ర‌తో క‌లిసి హిందూపురంలో ఓటుహ‌క్కు వినియోగించుకున్నారు.

 

RELATED ARTICLES

తాజా వార్తలు