Bumrah| టీమిండియా పేసర్ బుమ్రా బౌలింగ్ యాక్షన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. వెరైటీ స్టైల్‌తో బౌలింగ్ చేస్తూ బ్యాట్స్‌మెన్స్‌ని ముప్పుతిప్పలు పెడుతుంటాడు బుమ్రా. ప్రస్తుతం ఈ క్రికెటర్ ముంబై తరపున ఆడుతూ ఈ సీజన్‌లో అత్యధిక వికెట్స్ తీసుకున్నాడు. ఈ క్రమంలో పర్పుల్ క్యాప్ కూడా అతనికి దక్కింది. బుమ్రా ఇప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరుగాంచాడు. అయితే అతని మాదిరిగా బౌలింగ్ చేయాలని ఇప్పటి కుర్రాళ్లు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. కాని అది అందరి వలన సాధ్యం కాదు. అయితే మహేష్ కుమార్ అనే బౌలర్ మాత్రం బుమ్రాని దించేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
ఆర్సబీ నెట్స్‌లో కనిపించిన ముహేష్ కుమార్ అనే బౌలర్ అచ్చం బుమ్రా మాదిరిగానే బౌలింగ్ చేస్తున్నాడు. స్లింగ్ ఆర్మ్ యాక్షన్‌తో అతను బౌలింగ్ చేసిన విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇతను రెండు సంవత్సరాల క్రితం గుజరాత్ టైటాన్స్ తో కలిసి ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆర్సీబీ నెట్ బౌలర్‌గా మారాడు. అయితే అతనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కాగా, అది పాత వీడియో. అయినప్పటికీ ఇందులో అతను పదునైన బంతులు విసురుతూ బౌలింగ్ చేస్తుండడం చూసి బుమ్రా డూప్ వచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అతని టాలెంట్ చూసి మంచి భవిష్యత్ ఉందని కామెంట్ చేస్తున్నారు.
ఇక కర్ణాటకకు చెందిన 27 ఏళ్ల బౌలర్ మహేశ్ 2018లో ఆర్‌సీబీ కి నెట్‌లో బౌలింగ్ చేశాడు. 2017లో భారత జట్టు నెట్స్‌లో కూడా బాల్స్ వేశాడు. అయితే ఆ తర్వాత ఆశిష్ నెహ్రా గుజరాత్ టైటాన్స్ నెట్స్‌కి అతడిని పిలిపించాడు. బౌలింగ్ షూలని అతనికి బహుమతిగా ఇచ్చాడు. ఇక విరాట్ కోహ్లీ పలు సూచనలు అందించాడు. ఇప్పుడిప్పుడే అవకాశం కోసం బాగా ప్రయత్నిస్తున్నాడు. వచ్చే ఐపీఎల్‌లో స్థానం దక్కించుకోవాలని కసి మీద ఉన్నాడు. మరి అతనికి బుమ్రా నుండి ఏమైన సలహాలు అందాయా అన్నది తెలియదు. ఇక బుమ్రా విషయానికి వస్తే ఇప్పుడు ఐపీఎల్‌లో 6.63 ఎకానమీ రేటుతో మొత్తం 14 వికెట్లు తీశాడు. ఆర్‌సీబీపై ఐదు వికెట్లు తీసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆర్సీబీపై ఇంత వరకు ఏ బౌలర్ కూడా ఆ ఘనత సాధించలేదు.
🎥 Mahesh Kumar – Net Bowler for Royal Challengers Bengaluru in IPL 2024.#IPL2024 #CricketTwitter pic.twitter.com/X5kXtd11hk
— Indian Domestic Cricket Forum – IDCF (@IDCForum) April 29, 2024