Monday, December 30, 2024
HomeCinemaManchu Manoj:పండంటి పాపకు జన్మనిచ్చిన మనోజ్ భార్య‌..పాపాకి భ‌లే వెరైటీ పేరు పెట్టారుగా..!

Manchu Manoj:పండంటి పాపకు జన్మనిచ్చిన మనోజ్ భార్య‌..పాపాకి భ‌లే వెరైటీ పేరు పెట్టారుగా..!

Manchu Manoj: మంచు మోహ‌న్ బాబు త‌న‌యుడు మంచు మ‌నోజ్ టాలీవుడ్‌లో వైవిధ్య‌మైన సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడు. ఆయ‌న ఇటీవ‌ల సినిమాలు కాస్త త‌గ్గించాడు. అయితే భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకొని ఇటీవ‌ల వార్త‌ల‌లోకి ఎక్కాడు. మౌనిక‌, మంచు మనోజ్‌కు ఇది రెండో పెళ్లి, మౌనికకు ఇదివరకే పెళ్లై ఓ బాబు ఉండ‌గా, తాజాగా ఆమె మ‌రో పాప‌కి జ‌న్మ‌నిచ్చింది. ఈ విష‌యాన్ని మంచు ల‌క్ష్మీ త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. మనోజ్, మౌనిక మరోసారి తల్లిదండ్రులయ్యారు. మా ఇంట్లోకి చిన్న దేవత వచ్చింది అని ల‌క్ష్మీ త‌న ట్వీట్‌లో తెలిపింది.

మనోజ్, మౌనిక ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమ పాపను ఈ లోకంలోకి స్వాగతించారు. అన్న అయినందుకు ధైరవ్ ఆనందానికి అవధులు లేవు. ఆమెను మేమంతా ముద్దుగా ‘MM పులి’ అని పిలుస్తాము. ఈ కుటుంబానికి ఆ శివుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.. మీరందరూ ప్రేమతో వారిని ఆశీర్వదించండి” అని మంచు ల‌క్ష్మీ ట్వీట్ చేయ‌గా, దానిని మంచు మ‌నోజ్ రీ ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం ప‌లువురు ప్ర‌ముఖులు, అభిమానులు వారికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఇక మంచు మనోజ్, మౌనిక కొన్నాళ్ల క్రితం రెండో వివాహం చేసుకోగా, అప్ప‌టికే మౌనిక‌కి ధైర‌వ్ అనే కుమారుడు ఉన్నాడు.

కొన్ని నెల‌ల క్రితం మంచు మనోజ్ ప్ర‌గ్నెంట్ అంటూ త‌న సోష‌ల్ మీడియాలో తెలియ‌జేశాడు మ‌నోజ్. ఇక ఆ త‌ర్వాత మౌనిక బేబీ షవర్, బేబీ బంప్ ఫోటోస్ నెట్టింట తెగ వైరలయ్యాయి. ఇక ఇప్పుడు పాప జన్మించగా, ఆ చిన్నారికి సంబంధించిన వేడుక‌ల‌ని గ్రాండ్‌గా నిర్వ‌హించ‌నున్నారు. వాటికి సంబంధించిన పిక్స్ కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం ఖాయం. అయ‌తే AIతో చేసిన పోస్టర్ షేర్ చేయ‌గా, అవి అదుర్స్ అనిపిస్తుంది. పులి ఒడిలో పడుకున్న పాపతో పాటు నలుగురం అయ్యామని చెప్పే ఓ AI పిక్ షేర్ చేశాడు ఈ మంచు మ‌నోజ్ . ఇవి ఆక‌ట్టుకుంటున్నాయి.

RELATED ARTICLES

తాజా వార్తలు