Sunday, December 29, 2024
HomeTelanganaమానుకోట ఘ‌ట‌న ఓ చారిత్రాత్మ‌క సంద‌ర్భం.. ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ట్వీట్

మానుకోట ఘ‌ట‌న ఓ చారిత్రాత్మ‌క సంద‌ర్భం.. ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ట్వీట్

హైద‌రాబాద్ : మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళ.. మానుకోట ఘటన ఓ చారిత్రాత్మక సందర్భం.. తెలంగాణ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఆ సంఘటన జరిగి నేటికి 14ఏండ్లు అవుతుంద‌ని గుర్తు చేస్తూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ట్వీట్ చేశారు.

ఆధిపత్య అహంకారంతో తుపాకులు ఎక్కుపెట్టిన అప్పటి పాలకులకు మానుకోట రాళ్లే సమాధానం చెప్పాయి. తుపాకీ తూటాలకు ధీటుగా తిరగబడ్డాయి. పోలీసుల బుల్లెట్లకు ప్రతిస్పందిస్తూ ఉద్యమకారులు చూపిన తెగువకు సమైక్య పాలకులు వెనుదిరుగక తప్పలేదు. తెలంగాణ ఉద్యమ ఉనికినే ప్రశ్నార్ధకంగా మార్చే ప్రయత్నాన్ని మానుకోట మట్టి సాక్షిగా ఉద్యమకారులు ఏకమై తిప్పి కొట్టారు.

స్వరాష్ట్ర ఆకాంక్షను మరోసారి బలంగా చాటిచెప్పారు. ఈ క్రమంలో తుపాకీ తూటాలకు వెరవలేదు, లాఠీలకు భయపడలేదు. స్వరాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ముందుకు కదిలి ఉద్యమానికి ఊపిరిలూదారు. ఆ చారిత్రక సన్నివేశాలు ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. చరిత్రపుటల్లోనూ అవి చిరస్థాయిగా నిలిచిపోతాయి. భవిష్యత్ తరాలకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటుతాయి అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు