Saturday, December 28, 2024
HomeTelanganaఇదేం క‌క్కుర్తి.. గంట‌న్న‌ర పాటు చేప‌ల‌ను దోచుకున్న జ‌నం.. వీడియో చూస్తే షాక‌వ్వాల్సిందే..

ఇదేం క‌క్కుర్తి.. గంట‌న్న‌ర పాటు చేప‌ల‌ను దోచుకున్న జ‌నం.. వీడియో చూస్తే షాక‌వ్వాల్సిందే..

Fish | ఇదేం కక్కుర్తి….ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగడం అంటే ఇదే అయి ఉండొచ్చు.. ఓ చేప‌ల వ్యాన్ అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. ఇంకేముంది.. బ‌తికున్న చేప‌ల‌ను దోచుకునేందుకు స్థానికులు గంట‌న్న‌ర పాటు ఎగ‌బ‌డ్డారు.

అది మ‌హ‌బూబాబాద్ జిల్లాలోని మ‌రిపెడ బ‌స్టాండ్. పొద్దుపొద్దున్నే ర‌హ‌దారిపై ర‌ద్దీ త‌క్కువ‌గానే ఉంది. కానీ ఓ పెద్దాయ‌న రోడ్డు దాటుతున్నాడు. ఆయ‌న‌ను త‌ప్పించేందుకు వేగంగా వ‌చ్చిన ఓ బొలెరో వాహ‌నం ప్ర‌య‌త్నించింది. ఇంకేముంది.. ఆ బొలెరో వాహ‌నం ప‌ల్టీలు కొట్టింది. అలా ప‌ల్టీలు కొట్టిందో లేదో.. దాంట్లో నుంచి చేప పిల్ల‌లు ఎగిరెగిరి రోడ్డు మీద ప‌డ్డాయి.

అటుఇటు వెళ్తున్న జ‌నాలు ఆ చేప పిల్ల‌ల‌ను చూసి ప‌రేషాన్ అయ్యారు. నోట్లో నీళ్లూరాయి. ఎప్పుడు చేప‌ల‌ను తిన‌న్న‌ట్టు.. వాటిని చూడ‌న‌ట్టు.. వాటి మీద ప‌డ్డారు. దొరికిన కాడికి దోచుకున్నారు. స్థాయికి మించి సంచుల్లో నింపుకున్నారు. ఇక బైక్‌ల‌పై అతి క‌ష్టం మీద చేప‌ల‌ను తీసుకెళ్లారు. అలా ఓ గంట‌న్న‌ర పాటు చేప‌ల కోసం ఎగ‌బ‌డ్డారు.

ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ వ్య‌క్తిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాధిత వ్య‌క్తిని వీరారం గ్రామానికి చెందిన జిన్న ఐల‌య్య‌గా పోలీసులు గుర్తించారు. ఆయ‌న స్థానిక డిగ్రీ కాలేజీలో అటెండ‌ర్‌గా ప‌ని చేస్తున్న‌ట్లు తెలిపారు. ఇక ర‌ద్దీని కంట్రోల్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్చి వ‌చ్చింది. అక్క‌డున్న వారిని చెద‌ర‌గొట్టారు. ఈ ఘ‌ట‌న‌తో ఆ ర‌హ‌దారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది.

RELATED ARTICLES

తాజా వార్తలు