Arjun Sarja| సెలబ్రిటీల ఇళ్లలో పెళ్లి వేడుకలంటే ఎంత హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హల్దీ, సంగీత్,మెహందీ ఇలా పలు ఈవెంట్స్‌తో తెగ సందడి చేస్తుండగా, వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంటాయి.తాజాగా ఒకప్పటి హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. అర్జున్ పెద్ద కూతురు, హీరోయిన్ ఐశ్వర్య వివాహం జూన్ 10న చెన్నైలోని హనుమాన్ ఆలయంలో తంబి రామయ్య కొడుకు, యంగ్ హీరో ఉమాపతితో జరగనున్న విషయం తెలిసిందే. వివాహ కార్యక్రమంలో భాగంగా రీసెంట్‌గా వారి హల్దీ, మెహందీ వేడుకలు జరిగాయి. ఈ క్రమంలో వాటికి సంబంధించిన పిక్స్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా చక్కర్లు కొడుతున్న ఫొటోలలో అర్జున్ సర్జా తన కూతురిని ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటూ కనిపించాడు. ఇదిలా ఉంటే ఐశ్వర్య, ఉమాపతి ఇద్దరిది లవ్ మ్యారేజ్ కాగా, చాలా రోజులుగా వీరు ప్రేమలో మునిగి తేలారు. ఇక ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లగా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇరు కుటుంబసభ్యులు. గతేడాది అక్టోబర్ లో వీరి నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరిగాయి. వాటికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాని షేక్ చేశాయి.
ఇక ఐశ్వర్య, ఉమాపతి కెరీర్ విషయానికి వస్తే .. ఐశ్వర్య కెరీర్ అంత సక్సెస్ ఫుల్ గా సాగడంలేదు. కూతురి కోసం అర్జున్ డైరెక్టర్ గా మారినా ఫలితం శూన్యం. విశ్వక్ సేన్-ఐశ్వర్య జంటగా అర్జున్ డైరెక్షన్ లో సినిమా అనౌన్స్ చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆ మూవీ సెట్స్ మీదకి వెళ్లకుండానే ఆగిపోయింది. కెరియర్ అంత సజావుగా సాగకపోవడం వల్లనే ఐశ్వర్య ఇప్పుడు పెళ్లికి సిద్ధమైంది. మరోవైపు ఉమాపతి మనియార్ కుటుంబం, తిరువనం, థానే వాడి, అడగప్పట్టత్తు మగజనంగళే లాంటి సినిమాల్లో హీరోగా నటించాడు. త్వరలోనే పెళ్లితో ఒక్కటి కాబోతున్న ఈ జంటకు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.