MI vs LSG| ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ ఇంత దారుణమైన ప్రదర్శనని ఎప్పుడు కనబరచి ఉండదు.అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.ఈ సీజన్‌ని ఓటమితో ప్రారంభించిన ముంబై ఇండియన్స్ ఓటమితోనే మ్యాచ్‌ని ముగించడం విశేషం. ఇక గత రాత్రి లక్నో,ముంబై మధ్య జరిగిన మ్యాచ్‌లో లక్నో తొలుత బ్యాటింగ్ చేసింది. ఆరు వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. మొదట్లో మంచి టార్గెట్ ఇస్తారా లేదా అనే డౌట్ ఉండేది. కాని నికోసల్ పూరన్ ఎంటర్ అయ్యాక మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఆకాశమే హద్దుగా చెలరేగి ముంబై బౌలర్స్‌కి చుక్కలు చూపించాడు.
29 బాల్స్‌లో ఎనిమిది సిక్సర్లు ఐదు ఫోర్లతో పూరన్ 75 పరుగులు చేశాడు నికోలస్ పూరన్.ఇక అతడితో పాటు కెప్టెన్ కేఎల్ రాహుల్ 41 బాల్స్‌లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 55 రన్స్ చేశాడు. ఇక చివర్లో బ్యాటింగ్‌కి వచ్చిన ఆయుష్ బదోని పది బాల్స్‌లో 22 పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటంతో లక్నో రెండు వందల స్కోరు మార్క్ దాటింది. ముంబై బౌలర్లలో చావ్లా, తుషారా తలో మూడు వికెట్లు తీసుకున్నారు. మిగిలిన బౌలర్స్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. అయితే ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడాడు అర్జున్ టెండూల్కర్. ముంబై తరపున బరిలోకి దిగిన అతను 2.2 ఓవర్లు వేసి వికెట్ తీయకుండా 22 పరుగులు ఇచ్చాడు. కండరాల నొప్పి వలన తన కోటా పూర్తి చేయకుండానే మైదానం వీడాడు.
ఇక 215 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు మొదట్లో అద్భుతంగా ఆడింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ కి బదులు ఓపెనర్‌గా బ్రేవిస్ బరిలో దిగాడు. వీరిద్దరు ముంబైకి అదిరిపోయే అరంభం అందించారు. ఇంపాక్ట్ ప్లేయర్ రోహిత్ శర్మ(38 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 68), నమన్ ధిర్(28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. మిగతా బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు. సూర్యకుమార్ డకౌట్ కావడం, ఇషాన్ కిషన్ (14 రన్స్), కెప్టెన్ హార్దిక్ పాండ్య (16 రన్స్) తక్కువ స్కోర్లకే ఔట్ కావడంతో ముంబై ఖాతాలో మరో ఓటమి చేరింది. అయితే లక్నో ఈ మ్యాచ్‌లో గెలవడంతో ప్లేఆఫ్స్‌పై కాస్త అవకాశాలు ఏర్పడ్డాయి.