Marian Robinson | వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అత్త మేరియన్ రాబిన్సన్(86) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం కన్నుమూసినట్లు ఒబామా కుటుంబ సభ్యులు తెలిపారు. తన తల్లి మేరియన్ రాబిన్సన్ చనిపోవడం బాధాకరంగా ఉందని ఒబామా భార్య మిచ్చెల్లి ఒబామా పేర్కొన్నారు. ఒబామా అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన ఎనిమిదేండ్ల పాటు.. మేరియన్ తనకు ఎంతో అండగా నిలిచారని మిచ్చెల్లి తెలిపారు. తన బిడ్డలై మలియా, షాషా ఒబామాకు వైట్ హౌస్‌లో రాబిన్సన్ ఎంతో సేవ చేశారని గుర్తు చేసుకుని మిచ్చెల్లి ఆనంద భాష్పాలు రాల్చారు.
రాబిన్సన్ 1937లో చికాగోలో జన్మించారు. ఆమెకు ఏడుగురు తోబుట్టువులు ఉన్నారు. మేరియన్ యుక్త వయసులో ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. రాబిన్సన్ 1960లో వివాహం చేసుకున్నారు. ఆమె ఇద్దరు పిల్లలు. ఒకరు మిచ్చెల్లి ఒబామా. రాబిన్సన్ టీచర్‌గా, సెక్రటరీగా కూడా విధులు నిర్వర్తించారు.