హర్యాణాలో మూక దాడి, ఒకరి హత్య
హర్యాణాలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. హర్యాణాలోని హంసావాస్ గ్రామంలో సమీర్ మాలిక్ అనే 26 ఏండ్ల వ్యక్తిని పశుమాంసం తిన్నాడనే అరోపణతో దుండగులు కొట్టి చంపారు. మాలిక్ పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి చెత్త ఏరుకొని బతుకుతున్నాడు. అతడికి భార్య, రెండేళ్ళ కుమార్తె ఉన్నారు. ఇటీవల కొందరు స్థానికులు చెత్త తీసుకువెళ్లాలని పిలిచి కొట్టి చంపారని తెలుస్తున్నది. ఈ ఘటన పై ఆందోళన చెలరేగడంతో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు.