దేశ వ్యాప్తంగా ఎంతో అతృతతో ఎదురుచూస్తున్న వెబ్ సిరీస్ మీర్జాపూర్ సీజన్ 3 ఎట్టకేలకు నాలుగేండ్ల విరామం తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించడంతో మూడో సీజన్ కోసం వేచి చూస్తున్న వారి కోరికలను నెరవేరుస్తూ ఈరోజు (శుక్రవారం, జులై 5) నుంచి ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
‘మీర్జాపుర్’ వెబ్ సిరీస్ ఓటీటీలో ఎంతగా సంచలనం సృష్టించింతో అందరికీ తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియోలో భారీ విజయం సాధించిన వెబ్ సిరీస్‌లలో అగ్ర స్థానంలో నిలవడంతో పాటు అత్యధిక రన్ టైమ్, కోట్లలో వ్యూస్ దక్కించుకున్న తొలి ఇండియన్ సిరీస్‌గా మీర్జాపూర్ నిలిచింది. క్రైమ్, థ్రిల్లర్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లకు కరణ్ అనుష్మాన్‌తో పాటు గుర్మిత్ సింగ్ మిహిర్ దేశాయ్ దర్శకత్వం వహించారు. తొలి సీజన్ 2018 నవంబరు 16న, రెండో సీజన్ అక్టోబరు 23 2020 న విడుదల చేశారు.
ఏడాది క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, హిందీతో పాటు సౌత్ ఇండియా భాషలన్నింటిలోనూ ఒకటే సారి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఒక్కొక్కటి 40 నుంచి 55 నిమిషాల నిడివితో మొత్తం 10 ఎపిసోడ్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో అభిమానుల సంబురాలు అంబరాన్ని తాకాయి. చాలామంది తమ సోషల్ మీడియా అకౌంట్లలో మీర్జాపూర్ సిరీస్‌కు సంబంధించి ట్వీట్లు, మీమ్స్ చేస్తూ దేశ వ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి తీసుకువచ్చారు.
పంకజ్ త్రిపాఠి, విజయ్ వర్మ విక్రాంత్ మాసే, కుల్ భూషణ్ ఖర్బంద, రసిక దుగ్గల్, ఇషా తల్వార్, శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్, శ్రియ పిల్గోంగర్, హర్షిత గౌర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మొదటి సీజన్‌లో గుడ్డూ భయ్యా, తన తమ్ముడు బబ్లూ, భార్య శ్వేతలను మున్నా ఎలా ఇబ్బంది పెట్టాడని చూపించారు. రెండో సీజన్‌లో మున్నాపై గుడ్డూ భయ్యా ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడో చూపించారు.
మూడో సీజన్‌లో మున్నా మరణం అనంతరం ఆయన అన్న అఖండానంద్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు, గుడ్డూ భయ్యా ఆ ప్రాంతాన్ని ఏలాడా, మున్నా భార్య ముఖ్యమంత్రి మాదురి ఏం చేసిందనే ఇంట్రెస్టింగ్ సీన్స్‌తో సిరీస్ ఆకట్టుకుంది. ఇందులో విజయ్ వర్మ కీలకపాత్రలో కనిపించనున్నారు. గత రెండు సీజన్లతో పోలిస్తే మూడో సీజన్ ఉత్కంఠభరితంగా ఉండనుంది.