IPL 2024| సీఎస్కే జట్టు ఆటగాడు డారిల్ మిచెల్ అభిమాని ఫోన్ పగలగొట్టడం చర్చనీయాంశం అయింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా, కొందరు దీనిపై తీవ్ర అభ్యంతంరం చేస్తున్నారు. గత ఆదివారం పంజాబ్‌తో సీఎస్కే మ్యాచ్ ఆడగా, ఆ మ్యాచ్‌లో చెన్నై జట్టు 28 పరుగుల తేడాతో మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు డారెల్ మిచెల్ గ్రౌండ్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అభిమానులు రెండు గంటల ముందే స్టేడియంలోకి వచ్చేసి ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్‌ని కూడా వీక్షించారు. కొందరు ఆటగాళ్లు తమ అభిమాన ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్ వీడియోలు కూడా తీసుకున్నారు. అయితే మిచెల్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతను కొట్టిన బంతి ఓ అభిమాని మొబైల్‌కి బలంగా తాకింది.
అయితే ఇది గమనించిన మిచెల్ ఆ అభిమానికి క్షమాపణలు చెప్పడంతో పాటు అతని గ్లోవ్స్‌ని బహుమతిగా ఇచ్చాడు. అయితే ఐఫోన్ పగిలిపోయిందన్న బాధ కన్నా కూడా స్టార్ ఆటగాడి గ్లోవ్ సొంతమైందనే ఆనందం అతనికి ఎక్కువ ఉందట. అయితే దీనిపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మిచెల్ గ్లోవ్స్‌కు బదులు మొబైల్ కొనిస్తే బాగుండేది. ఇంటికి వెళ్లాక మొబైల్ పగలగొట్టుకున్న వ్యక్తికి బడిత పూజ అయి ఉంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైన ఇప్పుడు ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది
అయితే టార్గెట్ మరీ ఎక్కువ లేకపోయిన కూడా ఆ లక్ష్యాన్ని ఛేదించడంలో పంజాబ్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. చెన్నై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంలో పంజాబ్ కింగ్స్ 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు రెండు అడుగుల దూరంలో ఉంది. పదకొండు మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు ఆరింట విజయం సాధించి 12 పాయింట్లు దక్కించుకుంది.ప్రస్తుతం పట్టికలో మూడో స్థానంలో ఉంది. చెన్నై తదుపరి మ్యాచ్‌లలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, ఆర్‌సీబీలతో తలపడనుంది. ఈ మూడు మ్యాచ్‌లలో రెండు గెలిస్తే సీఎస్కే ప్లేఆఫ్స్‌కి చేరినట్టే