Saturday, January 4, 2025
HomeTelanganaఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తున్నా- మాజీ మంత్రి...

ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తున్నా- మాజీ మంత్రి హరీష్ రావు

ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తున్నా- – మాజీ మంత్రి హరీష్ రావు
గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా – – మాజీ మంత్రి హరీష్ రావు

ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలంగాణ ఉద్యమం నుంచే బిఆర్ఎస్ పోరాటం చేస్తున్నద‌నీ, ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు ఆనాడే ఎస్సీ వర్గీకరణ కోసం డిమాండ్ చేశార‌ని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం అందరికి విదితమే. ఎస్సీ వర్గీకరణ చేయాలని 16మే, 2016 నాడు ప్రధాని మోదీని స్వయంగా కలిసి లేఖ ఇచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, తద్వారా విద్య, ఉద్యోగ అవకాశాల్లో యువతకు అవకాశం కల్పించాలని కోరుతున్నాని హ‌రీష్ రావు ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు.

RELATED ARTICLES

తాజా వార్తలు