బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
MLA Maheshwar Reddy | కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి వచ్చిన రూ. 3 వేల కోట్ల నిధులకు చీకటి టెండర్లు కోడ్ చేసి కుంభకోణం చేశారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్‌లో మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి వచ్చిన రూ. 3 వేల కోట్ల నిధులకు చీకటి టెండర్లు కోడ్ చేసి కుంభకోణం చేశారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్‌లో మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పై ఒక వైపు జ్యుడిషియల్ విచారణ జరుగుతుంటే… అదే మెగా కృష్ణారెడ్డికి రూ. 11 వందల కోట్ల పనులు ఎలా అప్పగించారు..? ఏడు నెలల్లో చేసిన చీకటి ఒప్పందాలకు, టెండర్లకు.. విచారణకు సిద్ధమా..? హెటిరో డ్రగ్స్ భూమి విషయంలోనూ, సివిల్ సప్లై అవినీతిపై విచారణకు సిద్ధమా..? కొడంగల్ ప్రాజెక్టు కూడా మెగా కృష్ణారెడ్డికే అప్పగించబోతున్నారు. తెలంగాణలో చీకటి కోణంలో చీకటి పాలన కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం నిధుల దుర్వినియోగంపై సీబీఐ, ఈడీ విచారణ చేయాలని కోరనున్నట్లు మహేశ్వర్ రెడ్డి తెలిపారు.