ప్రచారానికి దూరంగా లీడర్లు
BRS Party | అత్త తిట్టింనందుకు కాదు… తోటి కోడలు నవ్వినందుకే కోపమన్న సామేత బీఆర్ఎస్ లీడర్లలో అచ్చొచ్చినట్టూ కనిపిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో బీఆర్ఎస్‌లో పట్టభద్రుల అభ్యర్థి సెలక్షన్ సెగ ఇంకా ఆ పార్టీని కుదిపేస్తోంది. పార్లమెంట్ ఫలితాలు రాకముందే ఆ పార్టీ లీడర్లు పట్టభద్రుల ప్రచారావికి దూరంగా ఉంటున్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ మూడు ఉమ్మడి జిల్లాల్లో ఉన్న పట్టభద్రులను కలిపి 2007లో ఈ సెగ్మెంట్ ఏర్పడింది. రెండు సార్లు కపిలవాయి దిలీప్, మరో రెండు సార్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ స్థానం ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగు పెట్టారు.
మొదటి నుండి నుండి గులాబీ పార్టీకి ఈ స్థానం కంచుకోటగా మారింది. ఈ సెగ్మెంట్లలో 4,61,806 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి, కోదండరాం, తీన్మార్ మల్లన్న మధ్య హోరాహోరీ పోరు జరిగింది. 2023 ఎన్నికల్లో జనగామ అసెంబ్లీ నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో పట్టభద్రుల స్థానం ఖాళీ అయింది. దీంతో ఉప ఎన్నికల అనివార్యమవుతున్నది. మరో నాలుగేండ్ల సమయం ఉన్న ఈ స్థానం కోసం రాజకీయంగా అన్ని పార్టీలూ పోటీ పడుతున్నాయి. బీఆర్ఎస్ నుండి ఏనుగు రాకేశ్ రెడ్డి, బీజేపి నుండి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్న లు నామినేషన్లు దాఖలు చేసి హోరాహోరీ ప్రచారంలో ఉన్నారు.
అయితే అభ్యర్థి ఎంపిక నుండి బీఆర్ఎస్‌లో వివావాదస్పదమవుతోంది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సూచించిన వ్యక్తి ఏనుగు రాకేష్ రెడ్డికే పట్టభద్రుల ఎన్నికల్లో పోటికీ అధినేత కేసీఆర్ అవకాశం ఇచ్చారు. పల్లా సూచించిన అభ్యర్థికి టికెట్ ఇవ్వొద్దని మూడు ఉమ్మడి జిల్లాల నేతలు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ కేసీఆర్ మళ్లీ పల్లా కోటరీకే ఇవ్వడంతో ఇప్పుడు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అగ్గిమీద గుగ్గిలవుతున్నారు. దీంతో ప్రచారం చేయడం ఇష్టం లేక పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే నేతలంతా టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారట. ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్న, బీజేపి నుండి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిలు పార్టీ నేతలతో సమావేశమవుతుంటే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రాకేశ్ రెడ్డి లీడర్లకు ఫోన్లు చేస్తుంటే కనీసం లిప్ట్ చేయడం లేదని చెబుతున్నారు.
తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మూడు ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశమైతే సగానికి పైగా లీడర్లు డుమ్మా కొట్టడం రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నది. పట్టభద్రుల ఎన్నిక పై సమీక్ష కోసం తెలంగాణ భవన్‌కు 130 మందికి కేటీఆర్ ఆహ్వానం పంపితే కేవలం 50 నుండి 55మంది మాత్రమే హజరయ్యారు. మాజీ మంత్రి ఎర్రెబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ సహా ఎంఎల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజు సారయ్య, తక్కళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణ రెడ్డితో పాటు పలువురు కార్పొరేషన్లు చైర్మన్, వరంగల్ నేతలు హాజరు కాలేదు.
కేటీఆర్ ఒత్తిడి మేరకు సమావేశానికి హాజరైన మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సమావేశం అలా ముగియగానే చెన్నైకి పది రోజుల చెన్నై ట్రిప్ వెళ్లారు. ఇక ఈ కష్టకాలంలో పార్టీ ప్రచారానికి ఉపయోగపడే మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఈ నెల 18 నుండి ఫ్యామిలీతో విదేశీ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారట. తాను ఫారిన్ ట్రిప్ వెల్లే లోపే ప్యాచ్ చేయాలని చూస్తున్నా వర్కవుట్ కాకపోవంతో కేటీఆర్ చేసేదేమి లేక నేతల్నీ బుజ్జగిస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణ భవన్‌లో మూడు జిల్లాల నేతల మీటింగ్ అంతా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేంద్రీకృతం కావడంతో ఆయన చికాకు పడి ఎవరు కో ఆపరేట్ చేసినా చేయకపోయినా గెలిపించుకునే బాధ్యత నాది అని కామెంట్ చేశారట.