HomeTelanganaMLC TATA MADHU: ఎమ్మెల్సీ తాత మధు విలేకరుల సమావేశం ముఖ్యంశాలు
MLC TATA MADHU: ఎమ్మెల్సీ తాత మధు విలేకరుల సమావేశం ముఖ్యంశాలు
- అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్న పాలన గాడిన పడలేదు.
- పాలన గాలికి వదిలేసి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి మంత్రులు.
- ఇన్ని రోజులు అయిన రైతులకు అందించాల్సిన ఎరువులు,విత్తనాలు సకాలంలో అందించడం లేదు.
- వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కేసీఆర్ పాలనలో జూన్ మాసంలోనే రైతు బంధు ఇచ్చేవాళ్ళు.
- కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా 15 వేలు ఇస్తాం అన్నారు .జులై నెల వచ్చిన ఇంకా రైతు భరోసా దిక్కు లేదు.
- రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి విధివిధానాలు అంటూ డిప్యూటీ సిఎం భట్టి ఆధ్వర్యంలో కమిటీ వేశారు.
- చింతకాని మండలం లో రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాను అని కూడా చెప్పాడు.నేను కాంగ్రెస్ వ్యక్తిని అని కూడా మరణ వాగ్మూలంలో చెప్పారు.
- నిన్న కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండారెడ్డి సిగ్గుమాలిన మాటలు మాట్లాడారు ఆయన బీఆర్ఎస్ నేత ఆ పార్టీకి చెందిన వ్యక్తి అని మాట్లాడారు కానీ రైతు ప్రభాకర్ స్వయంగా నేను కాంగ్రెస్ కు ఓటు వేశాను అన్నారు.మరి కోదండారెడ్డి వినిపించడం లేదా.
- భట్టి విక్రమార్క అనుచరుడు వల్లనే ఇందులో ప్రధాన నిందితుడు. ఆయనను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు.
- మొదటి నిందితుడు గా ఉన్న భట్టి అనుచరుడ్ని 8 వ నిందితుడు గా ఎలా చేర్చుతారు.
- ముఖ్యమంత్రి మాత్రం ఉన్నతస్థాయి విచారణ అంటాడు కానీ అతను భట్టి కి చాలా దగ్గర ఆయన ఒక జెడ్పిటిసి భర్త కూడా.
రాష్ట్రంలో ఎక్కడ చూసిన రైతుల ఆత్మహత్యలు తప్ప ఇంకోటి లేదు.
ప్రజావాణి కి వెళ్లి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉంది.
- మహబూబ్ నగర్ లో నిన్న ప్రజావాణి కి వెళ్లి ఆత్మహత్య యత్నం చేసుకుంటే పొలిస్ లు అడ్డుకున్నారు.
- సచివాలయం ముట్టడికి నిన్న రైతులు వచ్చారు.రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీరు ఎం చేస్తున్నారు.
ప్రధమ ముద్దాయి గా ఉన్న కిషోర్ కేస్ బుక్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
- భట్టి విక్రమార్క ను డిమాండ్ చేస్తున్న ప్రభాకర్ రైతు కుటుంభం కు 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి,వారి కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.
- రైతు పిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులను వెంటనే అక్కడ నుండి బదిలీ చేయాలి. అప్పుడే రైతు కుటుంబం కు న్యాయం జరుగుతుంది.