- రష్యా సైన్యంలోని భారతీయులకు విముక్తి..
- విడుదల చేసేందుకు పుతిన్ నిర్ణయం
మాస్కో: భారత్‌కు భారీ దౌత్య విజయం లభించింది. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడుదల చేసేందుకు వ్లాదిమిర్ పుతిన్ ఒప్పుకున్నారు. వారిని వెంటనే ఆర్మీ విధులనుండి వెనక్కి రప్పిస్తామని, స్వదేశానికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఈమేరకు ప్రధాని మోదీకి ఇచ్చిన ప్రైవేట్ విందులో పుతిన్ మాట ఇచ్చినట్లు తెలియవచ్చింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ మాస్కో చేరుకున్నారు. ఈ సందర్భంగా మాస్కో శివార్లలోని నోవో-ఒగార్యోవో అధికార నివాసంలో మోదీని పుతిన్ ఆహ్వానించారు. రాత్రి మోదీకి పుతిన్ ప్రత్యేక విందు ఇచ్చారు. ఐతే రష్యా సైన్యంలో భారతీయుల విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావనకు తెచ్చారు. వారిని తప్పక విడుదల చేస్తామని పుతిన్ హామీ ఇచ్చారు. మూడోసారి విజయం సాధించినందుకు మోదీని అభినందించారు. మోదీ పాలనలో భారత్ సాధించిన అభివృద్ధిని పుతిన్ ఈ సందర్భంగా కొనియాడారు.
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో భారత్ నుంచి తీసుకెళ్లిన యువకులను రష్యా తన సైన్యంలో చేర్చుకున్నది. ఈ క్రమంలో ఇద్దరు భారతీయులు మృతిచెందారు. తమను మోసం చేసి సైన్యంలో చేర్చారని సుమారు 25 మంది ఆరోపిస్తున్నారు. తమను సైన్యం నుంచి విడిపించి స్వదేశానికి తీసుకెళ్లాలని గతకొంత కాలంగా వారు వేడుకుంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకున్న మోడీ పుతిన్ ని కోరడం ఆయన ఓకే అందం ఇరు దేశాలకు ముదావహం.