హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narasimhulu) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. లోక్‌సభ ఎన్నికల్లో మాదిగ సామాజికవర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మాదిగ జాతికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. నర్సింహులు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిండు.. అది అర్థం చేసుకోవాలి. మోత్కుపల్లి ఆరు సార్లు గెలిచిండు. నువ్వు ఏదో పీకుడుగానిలా మాట్లాడుతున్నావు. నువ్వు నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వవా..? దుర్మార్గుడా.
నువ్వు మొగోనివా..? కులాల ప్రతిపాదికన సీట్ల కేటాయింపు విషయంపై మాట్లాడుతా అంటే నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వడు ఆ మొనగాడు. నువ్వు ఎన్ని రోజులు ఉంటవ్ సీఎంగా.. నా మాదిగ బిడ్డలు నీకు కర్రుకాల్చి వాత పెడుతారు.. గుర్తుంచుకో. ఎవడ్రా నువ్వు. మా జాతిని తొక్కేసే కుట్ర చేస్తున్నావ్. ఏబీసీడీ వర్గీకరణ గురించి పార్లమెంట్‌లో మాట్లాడకుండా కుట్ర చేస్తున్నవ్. 80 లక్షలున్న నా మాదిగలకు ఒక్క టికెట్ ఇవ్వకుండా పట్టుమని 10 మంది ఉన్న వేరే కులాలకు టికెట్ ఇస్తావా రేవంత్ రెడ్డి. ఏ రకంగా ఇది సమన్యాయం. ఏ రకంగా సమర్థించుకుంటవ్. పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తడు. కానీ చేసేది మాత్రం శూన్యం. రేవంత్ రెడ్డి చాతకాని వెధవ.
నెల రోజుల నుంచి నాకు నిద్ర పట్టడం లేదు. ఇంత ఘోరమైన తప్పు చేస్తుంటే చూస్తూ ఎట్లా ఉండాలి. నేను పార్టీలో ఉంటే నువ్వు చేసే దొంగ పనులకు సాక్ష్యంగా ఉంటూ బతకాల్నా..?. నా జాతి మొత్తాన్ని సమాధి చేస్తుంటే చూస్తూ ఊరుకోవాల్నా?. ఒక్కో కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇవ్వమని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పారా..?. వెంకటస్వామి కుటుంబంలో అయితే ముగ్గురికి టికెట్లు ఇచ్చారు. 80 లక్షల మంది ఉన్న మాదిగ జాతికి ఒక్క టికెట్ కూడా ఇవ్వరంటా..? ఇది ఎంత వరకు న్యాయం..? అంటూ నిలదీశారు.