Mumbai Indians| టైటిల్ ఫేవరేట్‌గా ఈ సీజన్‌లో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు అందరి కన్నా ముందు నాకౌట్ అయింది. ఇక వారికి ఈ సీజన్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాల్సి ఉంది. మే 17న లక్నో సూపర్ జెయింట్‌తో వారు తలపడనుండగా, గెలుపుతో ఈ సీజన్‌ని ముగించాలనే కసితో ఉన్నారు. ఈ మ్యాచ్‌తో లక్నో సూపర్ జెయింట్స్‌కి కాని ముంబై ఇండియన్స్‌కి కాని ఎలాంటి ప్రయోజనం లేదు. కేవలం లాంఛనం మాత్రమే. అయితే ఇదే సమయంలో ముంబై ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేయగా, ఇందులో ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్ మధ్య కుస్తీ పోటీ జరుగుతుంది. ఇది చూసి అభిమానులు కంగుతిన్నారు.
ఓవైపు ఇతర ముంబై ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ లో నిమగ్నమై ఉండగా, మరోవైపు మరోవైపు ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్ జంటగా రెజ్లింగ్ చేస్తున్నారు. ఇందులో ఇషాన్ కిషన్ 6 అడుగుల టిమ్ డేవిడ్‌ను ను కిందపడేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. అయితే టిమ్ డేవిడ్ బలమైన అథ్లెట్ కావడంతో ఆయన సులువుగా ఇషాన్‌ని కింద పడేశాడు. ఈ దృశ్యాన్ని మిగతా ఆటగాళ్లు కూడా చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు. ఈ రెజ్లింగ్ వీడియోను ముంబై ఇండియన్స్ తమ అభిమానుల కోసం సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయగా, ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఇషాన్ కిషన్ ఈ రోజు జరగనున్న మ్యాచ్ తర్వాత ఖాళీనే. మనోడికి టీ20 ప్రపంచ కప్‌లో చోటు దక్కేలేదు.
టిమ్ డేవిడ్ మాత్రం టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టుకి ఎంపికయ్యాడు. మెగా టోర్నీ ముందు వీరు ఇలా తలపడడం, అనుకోకుండా ఏదైన జరిగి ఉంటే ఆస్ట్రేలియాకి పెద్ద దెబ్బనే కదా అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే జట్టుకి కెప్టెన్‌గా ఉండి ఐదు సార్లు టైటిల్స్ అందించిన రోహిత్‌ని పక్కన పెట్టి హార్ధిక్ పాండ్యాని కెప్టెన్‌గా నియమించడం పెద్ద వివాదాస్పదం అయింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్‌లో ఆశించిన మేర రాణించకపోవడం అభిమానులని తీవ్ర నిరాశపరచింది. ఈ క్రమంలో వచ్చే సీజన్ కోసం ముంబై ఇండియన్స్ వేలం ఆసక్తికరంగా ఉంటుంది.