Mumbai Indians| ఐపీఎల్ సీజన్ 17 క్లైమాక్స్‌కి చేరుకుంది. అన్ని జట్లు కూడా ఇప్పుడు ప్లే ఆఫ్స్ కి వెళ్లేందుకు గట్టిగా పోరాడుతున్నాయి. ఏ జట్టు ప్లే ఆఫ్స్‌కి వెళుతుందా అనే చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి. అయితే పది మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ ఎనిమిదింట్లో గెలిచి దాదాపు ప్లే ఆఫ్ చేరుకుంది. అయితే మిగతా జట్లలోని కొన్ని జట్లు కూడా రాజస్థాన్ రాయల్స్ పాయింట్స్‌కి సమంగా వచ్చే అవకాశం ఉండడంతో ప్లేఆఫ్స్‌కి ఆర్ఆర్ చేరినట్టు అధికారంగా చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం కేకేఆర్ కోల్‌కతా నైట్ రైడర్స్ 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ జట్టు కూడా దాదాపు ప్లే ఆఫ్స్‌కి వెళ్లినట్టే. మొదటి రెండు స్థానాలలలో ఆర్ఆర్, కేకేఆర్ అయితే పక్కా ఉంటాయి.
ఇక వాంఖడే వేదికగా కేకేఆర్ చేతిలో ఓటమి అనంతరం ముంబై ఇండియన్స్ ఇంటికే అని అందరు అనుకున్నారు. కాని వారికి ఇంకా ప్లే ఆఫ్స్‌కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన అన్ని మ్యాచ్‌లలో భారీ విజయంతో గెలిచి ఇతర టీంల ఫలితాలపై ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్ వెళుతుందో లేదా అని క్లారిటీ వస్తుంది. 11 మ్యాచ్‌లు ఆడిన హార్ధిక్ సేన కేవలం మూడింట్లో గెలిచి ఆరు పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇంకా వారు మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా, అవి మూడు గెలిస్తే వారి ఖాతాలో 12 పాయింట్లు చేరతాయి. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. అయితే ఇప్పుడు ముంబై టాప్ 4కి చేరాలంటే లక్నో సూపర్ జెయింట్స్ అన్ని మ్యాచ్‌లు ఓడిపోవాలి.
లక్నో రానున్న రోజులలో కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌తో పోరాడనుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ జట్లు 12 పాయింట్లు దగ్గర ఆగిపోవాలని వారు కోరుకోవాలి. ఇలాంటి సమయంలోను హార్ధిక్ సేన మంచి రన్ రేటు సాధించి ఉండాలి. ప్రస్తుతం ముంబై నెగటివ్ రన్‌రేటులో (-0.356)లో ఉంది కాబట్టి మిగతా మూడు మ్యచ్‌లలో భారీ విజయం సాధిస్తే రన్ రేట్ మెరుగయ్యే అవకాశం ఉంది. అప్పుడు ముంబై ప్లేఆఫ్స్‌కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇదంతా దాదాపు అసాధ్యమనే చెప్పాలి.