ఉప్పల్ బాలు ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. గత కొన్నేండ్ల నుంచి సోషల్ మీడియాలో పాపులర్. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో రీల్స్ చేస్తూ రచ్చ చేస్తాడు. అంతేకాదు ఆడ వేషంలో బయటకు వెళ్తూ, ఫంక్షన్లకు అటెండ్ అవుతూ హంగామా సృష్టిస్తాడు. అలా ఉప్పల్ బాలు అనతి కాలంలోనే అందరికీ సుపరిచితమైపోయాడు.
తొలిసారిగా ఉప్పల్ బాలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. వైజాగ్ సత్యతో కలిసి ఉప్పల్ బాలు ఓ వీడియోను విడుదల చేశాడు. ఫస్ట్ వైజాగ్ సత్య మాట్లాడుతూ.. తాము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపాడు. అనంతరం ఉప్పల్ బాలు మాట్లాడుతూ.. నా ఫేవరెట్ రాజకీయ మనిషి రేవంత్ రెడ్డి. ఐదారు సంవత్సరాల నుంచి నేను రేవంత్ రెడ్డి ఫ్యాన్‌ని. ఆయన సీఎం అయినందుకు చాలా సంతోష పడుతున్నాను అని ఉప్పల్ బాలు అన్నాడు. అయితే వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు తమ మెడలో కాంగ్రెస్ కండువా వేసుకుని కనిపించారు.
రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన ఉప్పల్ బాలు. pic.twitter.com/Q1I9Ztzjvl
— Telugu Scribe (@TeluguScribe) May 8, 2024