Naga Babu| గత కొద్ది రోజులుగా మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య వైరం గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తుంది. రామ్ చరణ్‌కి బన్నీకి పడడం లేదని ఇద్దరు దూరంగా ఉంటున్నారని కొందరు ప్రచారం చేస్తుండగా, మరి కొందరు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ ట్యాగ్ చెరిపేసుకోవాలనే ప్రయత్నాలలో ఉన్నారంటూ కామెంట్ చేస్తూ వచ్చారు. ఇదే సమయంలో అల్లు అర్జున్ పోలింగ్‌కి రెండు రోజుల ముందు అంటే మే 11న వైసీపీ అభ్యర్ధి, బన్నీ స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా నంద్యాలకు వెళ్లారు. అక్కడ బన్నీని చూసేందుకు చాలా మంది అభిమానులు రాగా, ఆ సమయంలో శిల్పాని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఇది జరిగిన రెండు రోజుల తర్వాత అంటే మే 13న నాగబాబు చేసిన ట్వీట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తన సోషల్ మీడియాలో మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైన పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే అంటూ నాగబాబు ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించే చేశారని అంతటా ప్రచారం జరిగింది. అయితే ఆ సమయంలో దీనిపై బన్నీ ఏదైన స్పందిస్తాడా అని అందరు అనుకున్నారు. కాని ఆయన శిల్పా రవిచంద్రారెడ్డి తనకు దగ్గరి మిత్రుడు కావడం వల్లే వెళ్లానని.. తనకే ఏ పార్టీతో సంబంధం లేదు, రాజకీయాలలోకి వచ్చే ఛాన్స్ కూడా లేదని అన్నారు.
అయితే బన్నీపై నాగబాబు ఇన్‌డైరెక్ట్‌గా అలా ట్వీట్ చేసే సరికి అల్లు అర్జున్ ఆర్మీ సోషల్ మీడియాలో నాగబాబుపై యుద్ధం చేపట్టింది. ఆయనని దారుణంగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్ డియాక్టివేట్ చేయటం అందరిని ఆశ్చర్యపరచింది. మొత్తానికి మెగా యుద్ధంలో అల్లు ఆర్మీకి నాగబాబు తలవంచినట్టైంది. నిజానికి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడంతో ఆయనకి మద్దతుగా రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా మెగా హీరోలు అందరు పిఠాపురం వెళ్లి తమ మద్దతు ప్రకటించారు. కాని బన్నీ మాత్రం కేవలం ట్వీట్‌తో సరిపెట్టారు.