Naga Chaitanya| టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్‌గా ఉండే నాగ చైతన్య, సమంత ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. వారి డైవర్స్ వార్త అప్పట్లో ఓ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.అయితే వీరిద్దరు విడాకులు తీసుకొని చాలా రోజులు అవుతున్నా కూడా ఇద్దరికి సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. అయితే సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య.. హీరోయిన్ శోభితా ధూళిపాళతో డేటింగ్‌లో ఉన్నాడని, పెళ్లి కూడా చేసుకుంటాడని ఓ రూమర్ మాత్రం నెట్టింట రచ్చగా మారింది. అసలు సమంత, నాగ చైతన్య విడిపోవడానికి శోభితనే ఓ కారణమంటూ కూడా ప్రచారం నడిచింది.
ఫారిన్‌లో వీరిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్‌లో కలిసి కనిపించడంతో వారికి సంబంధించిన రూమర్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం ఇద్దరు డేటింగ్ చేస్తున్నారని త్వరలోనే నాగచైతన్య, శోభితా వివాహం కూడా చేసుకుంటారని టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో శోభిత పెట్టిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల నాగ చైతన్య సమ్మర్ వెకేషన్ కోసం ఓ ప్రాంతానికి వెళ్లి అక్కడ దిగిన ఫోటో షేర్ చేశాడు. ఆ ఫోటోకి శోభిత లైక్ కొట్టింది. ఇక తాజాగా ఓ పిక్ షేర్ చేస్తూ.. ఐయామ్ నాట్ ఎవ్రీవన్ కప్ ఆఫ్ చాయ్( Chai ), అండ్ దట్స్ ఓకే అంటూ తన పోస్ట్‌కి కామెంట్‌గా రాసుకొచ్చింది.
అంటే సాధారణంగా టీ గురించి రాసుకొస్తే వన్ కప్ ఆఫ్ టీ అంటూ రాస్తారు, కాని శోభిత మాత్రం Chai అని రాయడంతో టీ గురించి చెప్పిందా లేకపోతే పరోక్షంగా నాగ చైతన్య గురించి మాట్లాడుతూ కామెంట్ చేసిందా అని నెటిజన్స్ జుట్టు పీక్కుంటున్నారు. ఇంకెప్పుడు వారి రిలేషన్ గురించి క్లారిటీ ఇస్తారా అని తెగ ఆలోచిస్తున్నారు. కాగా, ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తుండాగ, ఈ మూవీకి చందూ మొండేటి దర్శకుడు. లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి ఇందులో నటిస్తున్నారు.ఇక శోభిత విషయానికి వస్తే మంకీ మ్యాన్ మూవీతో హాలీవుడ్ లోకి అడుగు పెట్టింది . అతి త్వరలోనే ఇది ఇండియాలో రిలీజ్ కానుంది.